Maxwell By Runner :అఫ్గానిస్థాన్‌పై అసాధారణ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చాడు ఆ జట్టు ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. అయితే సెంచరీ పూర్తైన తర్వాత ఆతడు క్రీజులో అసౌకర్యంగా కనిపించాడు. ఒక దశలో నొప్పితో బాధపడ్డాడు కూడా. మ్యాచ్ మధ్యలో పలుమార్లు ఆసీస్ జట్టు ఫిజియో గ్రౌండ్లోకి వచ్చి.. మ్యాక్స్‌వెల్‌కు చికిత్స అందించాడు. దీంతో కొద్దిగా కోలుకున్నట్లు కనిపించిన మ్యాక్స్.. సింగిల్స్ తీయడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. కేవలం ఫోర్లు, సిక్సర్లతోనే స్కోర్ బోర్డును ముందుకు నడింపించాడు. సాధారణంగా ఏ ప్లేయరైనా బ్యాటింగ్ చేస్తుండగా గాయపడితే బైరన్నర్‌ను పెట్టుకుంటారు. అయితే మంగళవారం నాటి మ్యాచ్‌లో రన్నర్ కావాలని మ్యాక్స్‌వెల్.. ఎందుకు అప్పీల్ చేయలేదంటూ క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఐసీసీ రూల్స్ ఎలా ఉన్నాయంటే..
ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌ల్లో బ్యాటర్ గాయపడితే.. రన్నర్ సహాయం తీసుకోకుండా ఐసీసీ షరతులు విధించింది. సెక్షన్ 25.5 ప్రకారం 2011 అక్టోబర్ 1న ఐసీసీ ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. అయితే ఇది కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాత్రమేనని.. డొమెస్టిక్ లీగ్‌ల్లో, ఇతర క్రికెట్ మ్యాచ్‌ల్లో బైరన్నర్‌ను పెట్టుకునే వెసులుబాటు కల్పించింది.
గతంలో బైరన్నర్ సహాయం తీసుకున్న టీమ్ఇండియా బ్యాటర్లు..గతంలో అన్ని దేశాల ఆటగాళ్లు.. ఆయా సందర్భాలల్లో రన్నర్‌ను పెట్టుకున్నారు. టీమ్ఇండియా బ్యాటర్ల విషయానికొస్తే.. 2003 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ - భారత్ మ్యాచ్‌లో వీరేందర్ సేహ్వాగ్.. సచిన్ తెందూల్కర్‌కు రన్నర్‌గా వ్యవహరించాడు. 2009 మొహాలీ టెస్ట్‌లో సురైశ్ రైనా.. వీవీఎల్ లక్ష్మణ్‌కు, 2011 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ - భారత్ మ్యాచ్‌లో సెహ్వాగ్‌కు గౌతమ్ గంభీర్ రన్నర్‌గా వ్యవహరించారు.