Mumbai Indians Coach : రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ముంబయి ఇండియన్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా సౌత్ ఆఫ్రికా మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ మార్క్ బౌచర్‌ను యాజమాన్యం నియమించింది. ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించింది. దీంతో మహేలా జయవర్ధనే స్థానాన్ని 45 ఏళ్ల బౌచర్ భర్తీ చేయనున్నాడు. ముంబయి లీగ్ బ్రాండ్‌ను బలోపేతం చేసుకోవడానికి యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇటీవల హెడ్ కోచ్‌గా ఉన్న జయవర్ధనే, భారత క్రికెటర్ మరో కీలక స్థానంలో ఉన్న జహీర్ ఖాన్‌ను తప్పించి.. వారికి గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫామెన్స్, గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా ప్రమోట్ చేసింది.
మార్క్ నియామకం విషయాన్ని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మైదానం లోపల.. వెలుపల బౌచర్‌కు ఉన్న అనుభవం జట్టును విజయపథంలో నడిపిస్తుంది. జట్టుకు ఆయన అద్భుతమైన విలువను జోడిస్తాడు" అని పేర్కొన్నారు.
దీనిపై మార్క్ బౌచర్ స్పందించాడు. "ముంబయి జట్టుకు కోచ్‌గా నియమించడాన్ని గౌరవంగా భావిస్తాను. ఆ జట్టు సాధించిన విజయాలు, చరిత్ర కచ్చితంగా దాన్ని ప్రపంచంలో అత్యంత విజయవంతమైన క్రీడా ఫ్రాంఛైజీగా నిలుపుతోంది. నేను సవాళ్లు, ఫలితాలపైనే దృష్టిపెడతాను. ముంబయి గొప్ప ఆటగాళ్లతో కూడిన బలమైన జట్టు. దాని విలువను మరింత పెంచేందుకు కృషి చేస్తాను" అని బౌచర్ పేర్కొన్నాడు.