తెలంగాణ

telangana

ETV Bharat / sports

'డివిలియర్స్​ తిరిగి అంతర్జాతీయ క్రికెట్​ ఆడొచ్చు!'

అంతర్జాతీయ క్రికెట్​లోకి డివిలియర్స్​ తిరిగి వచ్చే అవకాశముందని మరోసారి తెలిపాడు దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్​. గతేడాది టీ20 వరల్డ్​కప్ సందర్భంగా ఈ తరహా ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఐపీఎల్​ సందర్భంగా మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశాడు బౌచర్​.

By

Published : Apr 16, 2021, 2:45 PM IST

Updated : Apr 16, 2021, 2:52 PM IST

de Villiers, Mark Boucher
డివిలియర్స్, మార్క్ బౌచర్

అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు ప్రకటించిన ఏబీ డివిలియర్స్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్​ మార్క్​ బౌచర్​. 2020 టీ20 ప్రపంచకప్​ సందర్భంగా ఏబీడీ తిరిగి జట్టులోకి వస్తాడని ఊహాగానాలు వినిపించాయి.

ప్రస్తుతం ఐపీఎల్​లో ఆడుతున్న డివిలియర్స్​పై మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశాడు బౌచర్. అతడు ప్రోటీస్​ టీమ్​లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలిపాడు.

ఇదీ చదవండి:మోంటే కార్లో మాస్టర్స్​: జకో ఓటమి, క్వార్టర్స్​కు రఫా​

''ఐపీఎల్​ కోసం వెళ్లే ముందు ఏబీ నాతో చాట్​ చేశాడు. లీగ్​లో మంచి ప్రదర్శన చేయాలని చెప్పాను. ప్రపంచ క్రికెట్​లో అతడు చాలా కీలకమైన వ్యక్తి.'' అని బౌచర్​ పేర్కొన్నాడు.

ఈ ఐపీఎల్​లో తొలి మ్యాచ్​లోనే డివిలియర్స్ అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 27 బంతుల్లోనే 48 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ​

ఇదీ చదవండి:సంజు ప్రీ పెయిడ్‌ సిమ్‌.. కోహ్లీ పోస్ట్‌ పెయిడ్‌!

Last Updated : Apr 16, 2021, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details