తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీకా ఇస్తామన్న ఫ్రాంఛైజీలు.. తిరస్కరించిన క్రికెటర్లు!

ఐపీఎల్​ ప్రారంభానికి ముందు ఫ్రాంఛైజీలు టీకాలు ఇవ్వడానికి ప్రయత్నించగా.. అందుకు ఆటగాళ్లు నిరాకరించారని తెలుస్తోంది. వ్యాక్సినేషన్ అనంతరం వచ్చే స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులకు భయపడి వ్యాక్సిన్​ తీసుకోనన్నట్లు ఓ క్రీడా ఛానల్ వెల్లడించింది.

ipl, Many players refused vaccination
ఐపీఎల్​, టీకా ఇస్తామన్న ఫ్రాంఛైజీలు.. తిరస్కరించిన క్రికెటర్లు!

By

Published : May 15, 2021, 10:59 AM IST

కరోనా కారణంగా ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ వాయిదా పడి ఇప్పటికే దాదాపు రెండు వారాలు కావొస్తుంది. వృద్ధిమాన్ సాహా, ప్రసిధ్ కృష్ణ.. మహమ్మారి నుంచి కోలుకోలేదు. వారింకా క్వారంటైన్​లోనే ఉన్నారు. సీఎస్కే బ్యాటింగ్​ కోచ్​ మైకేల్ హస్సీ, బౌలింగ్​ కోచ్​ బాలాజీకి కరోనా నెగెటివ్​గా తేలింది.

అయితే ఐపీఎల్​​ ప్రారంభానికి ముందే టీకాలు వేయడానికి ఫ్రాంఛైజీలు ప్రయత్నించాయి! కానీ, వ్యాక్సిన్​ తీసుకోవడానికి ఆటగాళ్లు సుముఖత చూపలేదని ఓ క్రీడా ఛానల్​ తెలిపింది. వ్యాక్సినేషన్​ తర్వాత వచ్చే స్వల్ప జ్వరానికి భయపడిన క్రికెటర్లు.. టోర్నీకి ముందు అనారోగ్యానికి పాలు కాకుడదని టీకాను నిరాకరించినట్టు తెలుస్తోంది. అయితే ఇది క్రికెటర్ల తప్పిదం ఎంతమాత్రం కాదని.. టీకా గురించి అవగాహన లేకపోవడమే కారణమని సదరు ఛానల్​ వెల్లడించింది.

వ్యాక్సినేషన్​ విషయంలో విదేశీ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. కానీ, అందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. దీంతో వారికి కూడా వ్యాక్సిన్​ వేయలేదు.

సాహా, ప్రసిధ్ అనుమానమేనా?

ఇంగ్లాండ్ వేదికగా కివీస్​తో జరిగే ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​కు ప్రకటించిన జాబితాలో సాహా, ప్రసిధ్​కు చోటు లభించింది. అయితే ఐపీఎల్ సమయంలో కరోనా బారిన పడిన వీరిద్దరూ.. ఇంకా కోలుకోలేదు. వారికి కొవిడ్ నెగెటివ్ రావాల్సి ఉంది. ఈ ఇరువురు మే 25న ముంబయిలో రిపోర్ట్​ చేయాలి. ఇంగ్లాండ్​ ఫ్లైట్​ ఎక్కేలోపు మూడు సార్లు కరోనా నెగెటివ్​ సమర్పించాల్సి ఉంది.

ఇదీ చదవండి:చెన్నై బ్యాటింగ్ కోచ్​ హస్సీకి కొవిడ్ నెగెటివ్

ABOUT THE AUTHOR

...view details