'హాల్ ఆఫ్ ఫేమ్' జాబితాలో చోటు దక్కించుకున్న క్రికెటర్ల పేర్లను ఐసీసీ ప్రకటించింది. క్రికెట్‌ను ఐదు శకాలుగా విభజించి.. ఒక్కో శకం నుంచి ఇద్దరు ఆటగాళ్ల చొప్పున ఈ జాబితాలో చేర్చింది. మొత్తం పది మందిలో ఇండియా నుంచి వినూ మన్కడ్‌తో పాటు శ్రీలంక నుంచి కుమార సంగక్కర, జింబాబ్వే నుంచి ఆండీ ఫ్లవర్‌కు ఈ గౌరవం దక్కింది.
1918 కంటే ముందు క్రికెట్ ఆడిన వారిలో ఆబ్రే ఫాల్క్‌నర్(దక్షిణాఫ్రికా), మోంటీ నోబ్లే(ఆస్ట్రేలియా)లకు ఈ జాబితాలో చోటు కల్పించింది. ఇంటర్ వార్ క్రికెట్(1918-1945) తరం నుంచి సర్ లియరీ కాన్స్టాంటైన్(వెస్టిండీస్), స్టాన్ మెక్‌కేబ్(ఆస్ట్రేలియా)లకు ఈ గౌరవాన్ని కల్పించింది ఐసీసీ. యుద్ధం తర్వాత క్రికెట్ శకం(1946-1970) నుంచి వినూ మన్కడ్(ఇండియా), టెడ్ డెక్స్టర్(ఇంగ్లాండ్)లకు ఈ అవకాశాన్ని ఇచ్చింది ఐసీసీ.