Women ODI rankings: భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, యాస్తికా భాటియా అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్లో మెరుగయ్యారు. ప్రపంచ కప్లో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్న వీరిరువురు వరుసగా 10, 39వ స్థానాల్లో నిలిచారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్లపై వరుస అర్ధశతకాలు బాదిన భాటియా.. 8 స్థానాలు ఎగబాకింది. మంధాన ఒక స్థానం మెరుగైంది. సారథి మిథాలీ రాజ్ మాత్రం ర్యాంకింగ్స్లో పడిపోయింది. గడిచిన రెండు వారాల్లో ఐదు స్థానాలు కోల్పోయిన మిథాలీ.. తాజాగా మరో ర్యాంకు దిగజారింది. బంగ్లాదేశ్తో మ్యాచ్లో డకౌట్ అయిన కెప్టెన్.. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
India women cricketers ODI rankings:బౌలింగ్ విభాగంలో పూజా వస్త్రాకర్ 13 స్థానాలు ఎగబాకింది. ప్రస్తుతం 56వ ర్యాంకులో ఉంది. వెటరన్ ప్లేయర్ జులన్ గోస్వామి ఏడో స్థానానికి పడిపోయింది. ఆల్రౌండర్ల ర్యాంకులో మాత్రం తొమ్మిదో స్థానానికి చేరుకుంది. గత రెండు మ్యాచుల్లో జట్టులో తుదిస్థానం దక్కించుకోలేకపోయిన దీప్తి శర్మ.. ఆల్రౌండర్ల జాబితాలో ఏడో స్థానానికి పడిపోయింది.