టీమ్ఇండియా యువ బ్యాట్స్‌మన్ కేల్ రాహుల్‌లో(KL Rahul News) నాయకత్వ లక్షణాలున్నాయని(KL Rahul Captaincy) అంటున్నారు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్. భవిష్యత్ కెప్టెన్‌గా(Team India Future Captain) అతణ్ని ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ టీ20 సారథిగా వైదొలగిన నేపథ్యంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
"బీసీసీఐ భవిష్యత్‌పై దృష్టిపెట్టడం మంచి విషయం. భారత్ ఓ కొత్త కెప్టెన్‌ను తయారు చేయాలనుకుంటే రాహుల్‌పై దృష్టి పెడితే మంచిది. ఇంగ్లాండ్‌లో అతడు చక్కగా బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్, 50 ఓవర్ల క్రికెట్లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతణ్ని వైస్ కెప్టెన్‌గానూ నియమించవచ్చు."