తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంగ్లా క్రికెటర్​ అనూహ్య నిర్ణయం- టెస్ట్​ క్రికెట్​కు వీడ్కోలు!

బంగ్లాదేశ్​ ఆల్​రౌండర్​ మహ్మదుల్లా టెస్ట్ ఫార్మాట్​ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన బంగ్లా క్రికెట్ బోర్డు.. అతడి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని పేర్కొంది.

Mahmudullah, bangla cricketer
మహ్మదుల్లా, బంగ్లా క్రికెటర్

By

Published : Jul 11, 2021, 12:40 PM IST

బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్​​ మహ్మదుల్లా టెస్ట్ క్రికెట్​కు గుడ్​బై చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. దీనిపై స్పందించిన బంగ్లా క్రికెట్ బోర్డు.. అతడి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని పేర్కొంది.

"అవును, అతడు(మహ్మదుల్లా) సుదీర్ఘ ఫార్మాట్​కు వీడ్కోలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కానీ, ఆ విషయాన్ని మాతో అధికారికంగా చెప్పలేదు. అతడు భావోద్వేగంలో ఈ నిర్ణయం తీసుకున్నాడేమో చూడాల్సి ఉంది."

-బంగ్లాదేశ్​ క్రికెట్ బోర్డు.

ప్రస్తుతం హరారే వేదికగా జింబాబ్వేతో ఏకైక టెస్టు ఆడుతోంది బంగ్లా. తొలి ఇన్నింగ్స్​లో 150 పరుగులు చేసిన మహ్మదుల్లా తమ జట్టు భారీ స్కోరు చేయడానికి సహకరించాడు.

బెస్ట్​ ఆల్​రౌండర్​..

బంగ్లా తరఫున 49 టెస్టులాడిన ఈ ఆల్​రౌండర్​ 31 సగటుతో 2,764 పరుగులు చేశాడు. 2009లో విండీస్​పై సుదీర్ఘ ఫార్మాట్​లో తన తొలి మ్యాచ్​ ఆడాడు. కెరీర్​ తొలిమ్యాచ్​లో బౌలర్​గా రాణించిన మహ్మదుల్లా.. 8 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో రెండో ఇన్నింగ్స్​లో 5 వికెట్లతో మెరిసి.. విదేశాల్లో బంగ్లాకు తొలి విజయాన్ని అందించాడు.

తర్వాత బ్యాట్స్​మన్​గానూ రాణించిన మహ్మదుల్లా.. ఓ దశలో వరుసగా ఐదు మ్యాచ్​ల్లో యాభైకి పైగా స్కోర్లు నమోదు చేశాడు. ఇందులో తన తొలి శతకం హామిల్టన్​ వేదికగా కివీస్​పై సాధించాడు. ఎనిమిదో స్థానంలో వచ్చి ఈ సెంచరీని అందుకున్నాడు ఈ ఆల్​రౌండర్​.

ప్రస్తుతం టీ20ల్లో బంగ్లాదేశ్​కు కెప్టెన్సీగా వ్యవహరిస్తున్న మహ్మదుల్లా.. 2015 ప్రపంచకప్​లో అత్యుత్తమ బంగ్లా బ్యాట్స్​మన్​గా నిలిచాడు.

ఇదీ చదవండి:పాక్​పై ఇంగ్లాండ్ సిరీస్​ విన్​- విండీస్ చేతిలో ఆసీస్​ చిత్తు

ABOUT THE AUTHOR

...view details