Vinod Kambli job : భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఇస్తున్న రూ.30వేల పింఛన్‌తోనే నెట్టుకొస్తున్నట్లు ఇటీవల టీమ్ఇండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ వెల్లడించిన విషయం తెలిసిందే. తన స్నేహితుడు సచిన్‌కు చెందిన తెందుల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీలో కోచ్‌గా ఉద్యోగం ఇప్పించినా.. దూరభారం వల్ల వెళ్లలేకపోతున్నట్లు వాపోయాడు. ''ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) నుంచి సహాయం కోసం ఎదురుచూస్తున్నా. క్రికెట్ పురోగతి కమిటీ (సీఐసీ)లో నాకు స్థానం కల్పించారు. కాని అది గౌరవపూర్వక హోదా. నా కుటుంబాన్ని పోషించాలంటే ఆదాయం కావాలి. ఏదైనా పని ఉంటే చెప్పమని ఎంసీఏను చాలాసార్లు అడిగా'' అని పేర్కొన్నాడు.
వినోద్ కాంబ్లీకి వ్యాపారవేత్త జాబ్ ఆఫర్, భారీగా వేతనం - వినోద్ కాంబ్లీ వ్యాపారవేత్త
బీసీసీఐ పింఛన్‌తోనే జీవితం గడుపుతున్నట్లు ఇటీవల వెల్లడించిన టీమ్ఇండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీకి ఓ వ్యాపారవేత్త జాబ్ ఆఫర్ ఇచ్చారు. క్రికెట్‌కు సంబంధించిన రంగంలో కాకుండా ఆర్థిక విభాగంలో అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. భారీగా వేతనం ప్యాకేజీ ఆఫర్ చేశారు.
ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన వ్యాపార వేత్త ఒకరు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అయితే క్రికెట్‌కు సంబంధించిన రంగంలో కాకుండా ఆర్థిక విభాగంలో అవకాశం ఇవ్వనున్నట్లు సదరు బిజినెస్‌మ్యాన్ సందీప్ తోరట్ వెల్లడించారు. నెలకు లక్ష రూపాయలు వేతనం చెల్లిస్తానని తెలిపారు. మరి వినోద్ కాంబ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.
ఇటీవల తన జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాట్లాడిన కాంబ్లీ.. బీసీసీఐ పెన్షన్ డబ్బులతోనే కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిపాడు. "ఉదయం 5 గంటలకు లేచి డీవై పాటిల్ స్టేడియానికి క్యాబ్‌లో వెళ్లేవాడిని. బాగా అలసిపోయేవాడిని. దీంతో సాయంత్రం పూట బీకేసీ మైదానంలో శిక్షణకు మారా. ఆట నుంచి రిటైరైన నాకు బీసీసీఐ పెన్షనే ఆధారం. బోర్డు పెన్షన్‌తోనే కుటుంబాన్ని పోషిస్తున్నా. ఇందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు. ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) నుంచి సహాయం కోసం ఎదురుచూస్తున్నా. క్రికెట్ పురోగతి కమిటీ (సీఐసీ)లో నాకు స్థానం కల్పించారు. కాని అది గౌరవపూర్వక హోదా. నా కుటుంబాన్ని పోషించాలంటే ఆదాయం కావాలి. ఏదైనా పని ఉంటే చెప్పమని ఎంసీఏను చాలాసార్లు అడిగా. నా పరిస్థితి గురించి సచిన్‌కు పూర్తిగా తెలుసు. అతని నుంచి నేను ఏమీ ఆశించట్లేదు. టీఎంజీఏలో పని కల్పించాడు. అందుకు నేను సంతోషంగా ఉన్నా. అతనో గొప్ప స్నేహితుడు. ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటాడు" అని కాంబ్లీ ఇటీవల వివరించాడు.