తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎప్పటికీ ధోనీనే గొప్ప ఫినిషర్​: కోహ్లీ - ధోనీ

ఐపీఎల్​ 2021(IPL 2021 News) తొలి క్వాలిఫయర్ మ్యాచ్​లో మెరుపు ఇన్నింగ్స్​ ఆడిన చెన్నై సారథి ఎంఎస్​ ధోనీపై(dhoni kohli) ప్రశంసల జల్లు కురిపించాడు బెంగళూరు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ(virat kohli news). ధోనినే ఎప్పటికీ గొప్ప ఫినిషర్​ అని కితాబిచ్చాడు.

kohli tweet on dhoni
కోహ్లీ ట్వీట్​

By

Published : Oct 11, 2021, 9:54 AM IST

దుబాయ్​ వేదికగా దిల్లీ(dc vs csk 2021)తో జరిగిన ఐపీఎల్​ 2021(ipl 2021 news) తొలి క్వాలిఫయర్​ మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ ఘన విజయం సాధించింది. చివరిలో వచ్చిన ధోనీ(dhoni kohli).. మెరుపు ఇన్నింగ్స్​ ఆడి తనదైన శైలిలో ఫినిషింగ్​ ఇచ్చి.. జట్టును ఫైనల్​కు తీసుకెళ్లాడు. చివరి ఓవర్​లో ఓ సిక్స్​, మూడు ఫోర్లు బాది విజయానికి అవసరమైన 18 పరుగులు(6 బంతుల్లో) చేశాడు ధోనీ. ఈ నేపథ్యంలో అతడిపై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు బెంగళూరు కెప్టెన్ విరాట్​ కోహ్లీ(kohli on dhoni).. ధోనీ 'గొప్ప ఫినిషర్​' అని కితాబిచ్చాడు.

"దిల్లీతో జరిగిన మ్యాచ్​లో మునపటి ధోనీ మళ్లీ కనిపించాడు. చివరిలో ధోనీ ఇన్నింగ్స్​ నన్ను ఎగిరి గెంతులేసేలా చేసింది. ఎప్పటికీ ధోనీయే గొప్ప ఫినిషర్​" అని కోహ్లీ ట్వీట్ చేశాడు.

దిల్లీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని చెన్నై(CSK vs DC 2021) ఛేదించింది. దిల్లీ బౌలర్లను ఉతప్ప(63) ఉతికారేశాడు. అతడికి గైక్వాడ్​(70) మద్దతుగా నిలిచాడు. ఆవేశ్​ ఖాన్ బౌలింగ్​లో రుతురాజ్​ గైక్వాడ్​ ఔట్​ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ.. ఓ సిక్సర్​ కొట్టాడు. ఆరు బంతులకు 12 పరుగులు చేయాల్సి రాగా.. వరుసగా మూడు ఫోర్లు బాది సీఎస్​కేను విజయ తీరాలకు చేర్చాడు.

తొలి ఇన్నింగ్స్​ ఇలా..

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన దిల్లీ నిర్ణీత 20ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి.. 172 పరుగులు చేసింది. పృథ్వీ షా(60), పంత్​(51*), హెట్​మయర్​(37) రాణించారు. పంత్​-హెట్​మయర్​ భాగస్వామ్యం(83) ఆ ఇన్నింగ్స్​కు హైలైట్​గా నిలిచింది.

ఇదీ చూడండి:CSK vs DC: ఉత్కంఠ పోరులో విజయం.. ఫైనల్​కు సీఎస్​కే

ABOUT THE AUTHOR

...view details