టీమ్ఇండియా డ్యాషింగ్ బ్యాట్స్ఉమెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) ఆటలోనే కాదు అందంలోనూ సూపరే! ఈమె అందానికి ఎంతోమంది కుర్రకారు ఫిదా అయ్యారు. అయితే ఈ ముద్దుగుమ్మ పెళ్లి గురించి అభిమానులకు ఎప్పుడూ ఆసక్తే. ఈ విషయమై గతంలోనే ఆమె స్పష్టత ఇచ్చింది. అయితే అది మళ్లీ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. 'మీరు పేమ లేదా పెద్దలు చూసిన పెళ్లి చేసుకుంటారా?' అని గతంలో ఓ నెటిజన్ అడగ్గా.. 'లవ్-రేంజ్డ్' అని తెలివిగా బదులిచ్చింది.
Smriti Mandhana: పెళ్లిపై స్మృతి మంధాన.. ట్వీట్ వైరల్! - Smriti Mandhana marriage update
టీమ్ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana).. పెళ్లి ఎప్పుడు ఎలా చేసుకుంటుందో చెప్పింది. దానికి సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే?
స్మృతి మంధాన
శనివారం ఉత్కంఠభరితంగా సాగిన చివరి వన్డేలో టీమ్ఇండియా.. ఇంగ్లాండ్ మహిళ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్మృతి కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ పట్టింది. దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అయింది. 'సూపర్ఉమెన్' అంటూ కామెంట్లు కూడా విపరీతంగా వచ్చాయి.
ఇదీ చూడండి:స్మృతి మంధాన.. ఆటలోనే కాదు అందంలోనూ మేటి