Longest Test Match in Cricket History: ఒక టెస్టు మ్యాచ్ సాధారణంగా నాలుగు లేదా ఐదు రోజులు జరుగుతుంది. కానీ, ఓ టెస్టు మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయేలా 9 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగింది. ఇంతకీ ఆ మ్యాచ్‌లో తలపడ్డ జట్లు ఏవి?. ఆ టెస్టు ఫలితం ఏమై ఉంటుంది? మొదలైన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
'టైమ్‌లెస్ టెస్టు'
1938-39లో ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య ఈ టెస్టు మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య డర్బన్ వేదికగా జరిగిన ఈ ఐదో టెస్టు.. క్రికెట్ చరిత్రలో అత్యధిక రోజులు ఆడిన టెస్టుగా నిలిచింది. 1939 మార్చి 3-14 వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి రోజు మరో 41 పరుగులు చేసి ఉంటే ఇంగ్లాండ్ విజేతగా నిలిచేది. కానీ, ఆటగాళ్లు బ్రిటన్ వెళ్లే బోటును అందుకోవాల్సి ఉన్న నేపథ్యంలో వారు ముందుగానే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీంతో మ్యాచ్ డ్రా అయింది. ఇలా ఎక్కువ రోజులు జరిగి, మ్యాచ్ ఫలితం డ్రాగా ముగిసినందున దీనికి 'టైమ్‌లెస్ టెస్టు' అనే పేరు వచ్చింది.
హిస్టరీ గేమ్..