తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత్​పై విజయం సంతోషమే.. కానీ ఇదే లక్ష్యం కాదు' - బాబర్ అజామ్

టీమ్ఇండియాపై గెలిచిన తరుణంలో ఆటగాళ్లు అతిచేయొద్దని సూచించాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్(babar azam latest news). ఇక్కడకు వచ్చింది కేవలం భారత్​పై గెలవడానికి మాత్రమే కాదని గుర్తు చేశాడు.

Babar
బాబర్

By

Published : Oct 25, 2021, 4:13 PM IST

టీమ్‌ఇండియాపై చారిత్రక విజయం సాధించాక పాకిస్థాన్ ఆటగాళ్లకు కెప్టెన్‌ బాబర్‌(babar azam latest news) అజామ్‌ గట్టి హెచ్చరికలు జారీ చేశాడు. ఈ అద్భుత విజయాన్ని ఆస్వాదించే క్రమంలో మితిమీరిన విధంగా సెలబ్రేషన్స్‌ చేసుకోకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సూచించాడు. ఈ మెగా టోర్నీలో భారత్​(ind vs pak t20)పై గెలవడానికి మాత్రమే రాలేదని, ప్రపంచకప్‌ సాధించేవరకు కష్టపడాలన్నాడు. మ్యాచ్‌ అనంతరం బాబర్‌ తమ ఆటగాళ్లతో సమావేశమైన వీడియోను పాక్‌ క్రికెట్‌ బోర్డు ట్విట్టర్​లో అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా బాబర్‌ ఇలా స్పందించాడు.

"మనం ఈ విజయాన్ని ఆస్వాదిద్దాం. హోటల్‌కు వెళ్లాక మన కుటుంబ సభ్యులతో సెలబ్రేట్‌ చేసుకుందాం. భారత్‌తో మ్యాచ్‌ అయిపోయింది కదా అని మిగతా మ్యాచ్‌లకు సన్నద్ధమవ్వడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ ఈ విజయాన్ని ఎంజాయ్‌ చేయండి. కానీ.. జట్టులో మీ పాత్రలేంటో మర్చిపోవద్దు. మనం ఇక్కడ భారత జట్టు ఒక్కదాన్నే ఓడించడానికి రాలేదు. ప్రపంచకప్‌ గెలవడానికి వచ్చాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి"

-బాబర్‌ అజామ్, పాక్ కెప్టెన్

ఆ జట్టు మాజీ కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌(misbah ul haq latest news) ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఈ విజయాన్ని ఆస్వాదించే క్రమంలో అతి చేయొద్దని, ప్రపంచకప్‌ గెలవడానికి ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉందన్నాడు. అది జరగాలంటే భారత్‌పై చెలరేగినట్లే ప్రతి ఆటగాడు మిగతా మ్యాచ్‌ల్లో రాణించాల్సిన అవసరం ఉందని మాజీ కోచ్‌ అభిప్రాయపడ్డాడు.

ఇవీ చూడండి: భారత్​తో మ్యాచ్.. రిజ్వాన్​ చెప్పి మరీ కొట్టాడు!

ABOUT THE AUTHOR

...view details