టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వ(Kohli Captaincy) మార్పుపై వస్తున్న వార్తలను బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా(rajiv shukla bcci vice president) కొట్టిపారేశారు. అక్టోబర్లో నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్(ICC T20 Worldcup 2021) ముగిసిన వెంటనే విరాట్(టెస్ట్), రోహిత్(వన్డే, టీ20) కెప్టెన్సీని పంచుకుంటారని వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని అన్నారు.
"ఈ వార్తలో నిజం లేదు. భవిష్యత్ గురించి జోస్యాలు చెప్పుకోకుండా టీ20 ప్రపంచకప్ పై దృష్టి పెడదాం. ద్వంద్వ కెప్టెన్సీ గురించి ఎలాంటి చర్చలు జరగలేదు."
-రాజీవ్ శుక్లా, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్.