Legends League Cricket 2023 Winner Prize Money:2023 లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఛాంపియన్‌గా నిలిచిన మణిపాల్ టైగర్స్ రూ. 2 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది. రన్నరప్‌గా నిలిచిన అర్బన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ. కోటి దక్కింది. ఆదివారం జరిగిన తుదిపోరులో అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ - మణిపాల్ టైగర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అర్బన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 187-5 పరుగులు చేసింది. అనంతరం 188 పరుగుల లక్ష్య ఛేదనలో మణిపాల్ 19 ఓవర్లలో 5 వికెట్లు 193 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ రెండో సీజన్ విజేతగా మణిపాల్ టైగర్స్ నిలిచింది. కాగా, టీమ్ఇండియా మాజీలు సురేశ్ రైనా హైదరాబాద్‌కు నాయకత్వం వహించగా, హర్భజన్ సింగ్ మణిపాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఈ టోర్నమెంట్ నవంబర్ 18న ప్రారంభమై డిసెంబర్ 09న ముగిసింది. ఈ టోర్నీలో టీమ్ఇండియా మాజీ ప్లేయర్లు గౌతమ్ గంభీర్, సురేశ్ రైనా, హర్బజన్ సింగ్, శ్రీశాంత్, పార్థీవ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్‌తోపాటు క్రిస్ గేల్, షేన్ వాట్సన్, ఆరోన్ ఫించ్, మోర్నీ మోర్కెల్ తదితరులు ఆయా జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో మరిన్ని విశేషాలు.
- టోర్నీ విజేత - మణిపాల్ టైగర్స్ - రూ. 2 కోట్లు ప్ర్రెజ్ మనీ
- టోర్నీ రన్నరప్- అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ - రూ. 1 కోటి ప్ర్రెజ్ మనీ
- లెజెండ్ క్రికెట్ లీగ్ 2023 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్- తిసారా పెరీరా (108 పరుగులు, 8 వికెట్లు)
- లెజెండ్ క్రికెట్ లీగ్ 2023 అత్యధిక పరుగులు- డ్వేన్ స్మిత్ (234 పరుగులు, 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ)
- లెజెండ్ క్రికెట్ లీగ్ 2023 అత్యధిక వికెట్లు- ఇమ్రాన్ ఖాన్ (9 వికెట్లు)