టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్(Kapil Dev) మళ్లీ బ్యాట్ పట్టుకున్నాడు. అయితే ఈ సారి బంతిని బాదేందుకు కాకుండా కరోనాను తరిమేందుకు గ్లోవ్స్ ధరించాడు.
కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఓ వినూత్న యాడ్లో కనిపించాడు కపిల్. క్రికెట్ ఆడేటప్పుడు ప్రమాదకరమైన బౌన్సర్లు మొహానికి తగలకుండా హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో.. కరోనా సోకకుండా ఉండేందుకు మాస్క్ ధరించడం అంతే ముఖ్యమని చెప్పాడు.
"నా జీవితంలో ఎన్నో ప్రమాదకరమైన బౌన్సర్లను ఎదుర్కొన్నాను. కానీ ఇది(కరోనా) అన్నిటికన్నా ఎంతో ప్రమాదకరం. బ్యాటింగ్కు దిగినప్పుడు దెబ్బలు తగలకుండా హెల్మెట్ ధరిస్తాను. అలాగే మాస్క్ కూడా కరోనా వైరస్ నుంచి రక్షిస్తుంది. హెల్మెట్ ధరించినప్పుడే ఆత్మవిశ్వాసంతో బంతిని బౌండరీ దాటిస్తాను. మీరు కూడా మాస్క్ ధరించి వైరస్ నుంచి దేశం నుంచి కాదు ఏకంగా ప్రపంచం అనే బౌండరీ నుంచి తరిమేయండి" అని కపిల్ వివరించాడు.
ఇదీ చూడండి: 'టీమ్ ఇండియా నెక్స్ట్ కోచ్గా అతడే బెస్ట్'!