భారత క్రికెట్‌ను తొలి నుంచి అనుసరించే వారికి సుపరిచిత పేరు (Syed Mushtaq Ali) సయ్యద్ ముస్తాక్ అలీ. ఈ పేరు వినగానే.. బోల్డ్ హిట్టింగ్, దమ్మున్న బ్యాటింగ్ గుర్తుకువస్తుంది. ఆయన ఆట గురించి తెలిసినవారైతే.. 'అలీ అసలు ఈ కాలంలో పుట్టాల్సిన బ్యాటర్. త్వరగా పుట్టేశారు.' అని అంటుంటారు. ఇప్పటి ఆటతీరును ఆయన శైలి సరిగ్గా సరిపోతుంది. విదేశీ గడ్డపై శతకం (Syed Mushtaq Ali Records) సాధించిన తొలి భారతీయుడు సయ్యద్. తన కెరీర్లో ప్రేక్షకులకు మరచిపోలేని ఇన్నింగ్స్‌ను బహుమానంగా అందిచాడు.
Syed Mushtaq Ali: క్రికెట్లో 'దంచికొట్టుడు' ఈయనతోనే మొదలు! - సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ
ప్రత్యర్థికి బౌలర్లకు గాల్లో చుక్కలు చూపించే ఆట ఊపందుకుంది టీ20లతోనే! ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో మోతమోగించడం నేటి క్రికెట్ శైలి. అయితే 7 దశాబ్ధాల కిందే అలాంటి ఆటతో.. కల్లు చెదిరే షాట్లతో.. ప్రేక్షకులకు అమితమైన వినోదాన్ని పంచిన క్రికెటర్ సయ్యద్ ముస్తాక్ అలీ. అలీ పేరిటే ఉన్న భారత దేశవాళీ టోర్నీ (Syed Mushtaq Ali Trophy) గురువారం ప్రారంభమైన సందర్భంగా ఆయన విశేషాలేంటో తెలుసుకోండి.
సయ్యద్ ముస్తాక్ అలీ
అలీ గౌరవార్థంగానే (Syed Mushtaq Ali Trophy) సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టోర్నీ జరుగుతోంది. గురువారమే (నవంబర్ 4న) ప్రారంభమైన ఈ టీ20 టోర్నమెంట్ (Syed Mushtaq Ali Trophy 2021) ఫైనల్ నవంబర్ 22న జరగనుంది. ఈ టోర్నీలోని అనేక మంది యువ ప్రతిభావంతులు జాతీయ జట్టులో చోటు సంపాదించుకుంటారు. ఈ సందర్భంగా ముస్తాక్ అలీ గురుంచి కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం..
- కేవలం 13 ఏళ్ల వయసులోనే అలీ ప్రతిభను గుర్తించిన భారత తొలి టెస్టు కెప్టెన్ సీకే నాయుడు.. అతడిని మెరికలా తీర్చిదిద్దాడు.
- 1964లో అలీని పద్మ శ్రీ వరించింది.
- భారత దేశవాళ్లీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ఈయన పేరిటే 2006-07లో ప్రారంభమైంది.
- ముస్తాక్ అలీ కుమారుడు గుల్రెజ్ అలీ, మనవడు అబ్బాస్ అలీ.. ఇద్దరూ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడారు.
-
ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్న (Syed Mushtaq Ali Family) ముస్తాక్ అలీ.. 2005లో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు.
- పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ అధ్యక్షుడు కూడా అయిన జుల్ఫికర్ అలీ భుట్టో.. ముస్తాక్ అలీకి రెండు సార్లు పాకిస్థాన్ పౌరసత్వం ఇవ్వడానికి ముందుకొచ్చాడు.
-
ఒకానొక సమయంలో 'జీవించి ఉన్న అత్యంత ఎక్కువ వయసుగల భారత టెస్టు క్రికెటర్'గా ఉన్నారు ముస్తాక్ అలీ.
ఇదీ చూడండి:T20 World Cup: టీమ్ఇండియాకు సెమీస్ చేరే అవకాశం ఉందా?