ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్. 99 పరుగులు సాధించి.. తన జట్టు ఓడినా కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ధావన్.. ఓ క్రికెటేతర విషయం ద్వారా మరోసారి వార్తల్లోకెక్కాడు. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో ధావన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత కీలక విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకుంటూ కనిపించాడు!
"ఇటీవలే దిల్లీలోని ఓ ఫామ్‌హౌస్ పార్టీలో ఓ వ్యక్తిని కలిశానని.. ఆమెను తొలి చూపులోనే ప్రేమించానని, ఆమెను చూడగానే తన జీవితంలో ఎన్నడూ లేని క్లారిటీ వచ్చిందని, ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయానని.. ఆమె మాట్లాడుతుంటే వింటూ ఉండిపోయానని అన్నాడు. ఆ తర్వాత రెండు రోజుల్లో తామిద్దరంలో కలిసి ఇంట్లో ఉన్నామని తెలిపాడు. ఓ వ్యక్తితో సెట్ అవుతుందని అనిపిస్తే వెయిట్ చేయడమెందుకు.. పాత విషయాలను మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించడమే" అని ధావన్ ఓ వీడియోలో చెప్పాడు.
ఈ వీడియోలో ధావన్ ప్రస్తావించిన వ్యక్తి ఎవరన్న విషయం స్పష్టంగా తెలియనప్పటికీ, అతడి మాటల ఆధారంగా తన కొత్త జీవితంలోకి వచ్చిన మరో మహిళ అన్న విషయం క్లియర్‌గా తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ధావన్ కొత్త ఇన్నింగ్స్ (పెళ్లి విషయంలో) ప్రారంభించాడని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే, ఇది లీక్‌డ్ వీడియోనా లేక ఏదైనా అడ్వర్టైజ్‌మెంట్‌లో భాగమా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, 8 ఏళ్ల వివాహ బంధం తర్వాత ధావన్ 2021లో భార్య అయేషా ముఖర్జీతో విడిపోయి.. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమ్‌లోని మిగతా పది మందిలో ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోరు చేసింది. అయినా సన్‌రైజర్స్‌కు.. పంజాబ్ 144 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అందుకు కారణం.. శిఖర్ ధావన్(99*; 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసం. సహ ఆటగాళ్లంతా చేతులెత్తేసిన వేళ ఈ ఓపెనింగ్ గబ్బర్ సింగ్ ఉప్పల్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి సంచలనం సృష్టించాడు. మిగతా బ్యాటర్లను బెంబేలెత్తించిన సన్‌రైజర్స్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొని 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ ధావన్ ఎంత గొప్ప పోరాటం చేసినా.. లక్ష్యం చిన్నది కావడంతో సన్‌రైజర్స్ పెద్దగా ఇబ్బంది పడలేదు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఛాంపియన్ తరహాలో ఆడి.. తాజా సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. సన్‌రైజర్స్‌లో రాహుల్ త్రిపాఠి(74 నాటౌట్; 48 బంతుల్లో 10×4, 3×6) చెలరేగి.. టీమ్‌కు విజయాన్ని అందించాడు. అంతకుముందు బౌలింగ్‌లో.. పంజాబ్‌ను కుప్పకూల్చడంలో యువ స్పిన్నర్ మయాంక్ మార్కండే(4/15) కీలక పాత్ర పోషించాడు. ఉమ్రాన్ మాలిక్ (2/32), మార్కో జాన్సెన్ (2/16) కీలకంగా వ్యవహరించారు.