తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎన్​సీఏ బాధ్యతలకు తిరస్కరించిన లక్ష్మణ్​

ఎన్​సీఏ అధిపతిగా బాధ్యతలు స్వీకరించేందుకు వీవీఎస్ లక్ష్మణ్​ నిరాకరించారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న రాహుల్ ద్రవిడ్.. టీమ్​ఇండియాకు కోచ్​గా సెలెక్ట్​ కానుండడం తెలిసిందే.

laxman latest news
ఎన్​సీఏ బాధ్యతలకు లక్ష్మణ్​

By

Published : Oct 19, 2021, 6:50 AM IST

ఎన్‌సీఏ అధిపతిగా బాధ్యతలు చేపట్టేందుకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ నిరాకరించారు. ప్రస్తుతం ఎన్‌సీఏను నడిపిస్తున్న రాహుల్‌ ద్రవిడ్‌.. టీ20 ప్రపంచకప్‌ అనంతరం టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా నియమితుడు కావడం దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌సీఏ బాధ్యతలు చేపట్టాలని బీసీసీఐ లక్ష్మణ్‌ను కోరగా.. అతనందుకు అంగీకరించలేదని తెలిసింది.

కొత్త ఎన్‌సీఏ అధిపతి కోసం బీసీసీఐ తన అన్వేషణను కొనసాగిస్తోంది. లక్ష్మణ్‌ ప్రస్తుతం బెంగాల్‌ క్రికెట్‌ జట్టుకు బ్యాటింగ్‌ సలహాదారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మెంటార్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.

ఇదీ చదవండి:'బీసీసీఐ-పీసీబీ మధ్య స్నేహబంధం ఏర్పడాలి'

ABOUT THE AUTHOR

...view details