శ్రీలంక వెటరన్ క్రికెటర్ లసిత్ మలింగ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యార్కర్లతో ప్రపంచ ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించిన ఈ పేసర్.. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు మంగళవారం ప్రకటించాడు. ఇదివరకే టెస్టులు, వన్డేలకు గుడ్‌బై చెప్పేసిన మలింగ.. టీ20ల నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు స్పష్టం చేశాడు.
2014 టీ20 ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టుకు మలింగానే కెప్టెన్. వైట్‌బాల్ క్రికెట్ లెజెండ్‌గా పేరుగాంచిన మలింగ తన రిటైర్మెంట్ గురించి సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాడు.
"నా టీ20 బూట్లకు శాశ్వత విశ్రాంతినిస్తున్నా. ఈ రోజు నుంచి అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నా. నా ప్రయాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. రాబోయే కాలంలో యువ క్రికెటర్లతో నా అనుభవాన్ని పంచుకుంటా."