ఐపీఎల్(IPL 2022 New Teams) కొత్త ఫ్రాంచైజీల్లో ఒకటైన అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్స్(CVC capital india) సంస్థ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యంపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ(Lalit Modi News) కూడా ఈ సంస్థకు ఫ్రాంచైజీ దక్కడంపై తీవ్రంగా విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.
సీవీసీ క్యాపిటల్ సంస్థ(CVC betting company) ప్రముఖ బెట్టింగ్ కంపెనీలలో పెట్టుబడులు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై పలువురి విమర్శలకు ప్రాధాన్యం ఏర్పడింది.
"బెట్టింగ్ కంపెనీలు కూడా ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయొచ్చన్నమాట. ఇది బీసీసీఐ తెచ్చిన కొత్త రూల్ అనుకుంటా. ప్రస్తుతం ఓ ఫ్రాంఛైజీ దక్కించుకున్న బిడ్డర్‌కు పేరుమోసిన బెట్టింగ్ సంస్థ కూడా ఉంది. బీసీసీఐ ఈ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోలేదా ఏంటి?. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతి నిరోధక శాఖ ఎలా పనిచేస్తుంది?."
--లలిత్ మోదీ, ఐపీఎల్ మాజీ ఛైర్మన్.