టీ20 ప్రపంచకప్(t20 worldcup 2021)లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక(sri vs ban t20) విజయం సాధించింది. ఈ మ్యాచ్ సమయంలో గొడవకు దిగిన లంక ఆటగాడు లహిరు కుమార, బంగ్లాదేశ్ ప్లేయర్ లిటన్ దాస్(lahiru kumara vs liton das)కు జరిమానా విధించింది ఐసీసీ. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నందుకు ఫైన్ విధిస్తున్నట్లు పేర్కొంది.
కుమార జీతం నుంచి 25 శాతం, లిట్టన్ దాస్(lahiru kumara vs liton das)కు 15 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ను విధించింది ఐసీసీ. మైదానంలో వారు వాడిన భాష, బాడీలాంగ్వేజ్ సరిగా లేదంటూ ఈ జరిమానా విధించింది. ఈ విషయంలో వీరిద్దరూ తమ తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరడం వల్ల.. విచారణ ఉండదని తెలిపారు ఐసీసీ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్.