టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు మోకాలి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయంది. ఈ విషయాన్ని అతడే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"సర్జరీ విజయవంతంగా పూర్తయింది. కోలుకునే స్థితిలో ఉన్నా. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. ప్రస్తుతం నా ఆలోచన అంతా వీలైనంత తొందరగా మైదానంలో అడుగుపెట్టడంపైనే."