తెలంగాణ

telangana

ETV Bharat / sports

గెస్ట్ హౌజ్​లో వ్యాక్సినేషన్.. కుల్దీప్​పై విచారణ - గెస్ట్ హౌజ్​లో వ్యాక్సిన్ కుల్దీప్ యాదవ్

కరోనా వ్యాక్సిన్ టీమ్ఇండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్​కు చిక్కులు తెప్పించింది. అతడు టీకాను ఆస్పత్రిలో కాకుండా గెస్ట్ హౌజ్​లో వేసుకోవడమే ఇందుకు కారణం.

Kuldeep Yadav
కుల్దీప్ యాదవ్

By

Published : May 19, 2021, 11:44 AM IST

టీమ్ఇండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు. ఓ గెస్ట్ హౌజ్​లో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడమే ఇందుకు కారణం. దీనిపై కాన్పూర్ పాలకమండలి విచారణకు ఆదేశించింది.

ఏం జరిగింది?

ఈ నెల 15న కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు తెలిపాడు కుల్దీప్ యాదవ్. అందుకు సంబంధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఇతడు వ్యాక్సిన్ కోసం జోగేశ్వర్ ఆస్పత్రిలో స్లాట్ బుక్ చేసుకున్నాడు. కానీ అందుకు విరుద్ధంగా కాన్పూర్ నగర్ నిగమ్ గెస్ట్ హౌజ్​లో టీకా వేయించుకున్నాడు. దీంతో ఇతడిపై విమర్శలు వచ్చాయి. దీనిని సీరియస్​గా తీసుకున్న కాన్పూర్ పాలకమండలి అతడిపై విచారణకు ఆదేశించింది. కొందరు నెటిజన్లు కూడా ఆస్పత్రిలో కాకుండా ప్రైవేట్ స్థలాల్లో ఎలా వ్యాక్సిన్ వేస్తారంటూ మండిపడుతున్నారు.

కుల్దీప్ యాదవ్ వ్యాక్సినేషన్

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్​తో పాటు ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​కు ఎంపిక చేసిన జట్టులో చోటు సంపాదించలేకపోయాడు కుల్దీప్. ఫామ్ లేమి కారణంగా ఇతడిని ఈ సిరీస్ నుంచి తప్పించింది సెలక్షన్ కమిటిీ. అయితే ఇదే సమయంలో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్​కు ఇతడని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details