Kuldeep Yadav On India World Cup 2023 Loss :ఇటీవల వరల్డ్‌కప్ ఫైనల్లో టీమ్ఇండియా ఓడిపోయి మూడోసారి టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. కానీ లీగ్ మొత్తం మంచి ప్రదర్శన చేసిన భారత జట్టు టోర్నీలో విజయవంతమైన టీమ్‌గా నిలిచింది. అయితే ఫైనల్లో భారత ఓటమిపై స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్పందించాడు. జట్టులోని అందరి సభ్యులాగానే తాను కూడా వరల్డ్ కప్ ఓటమిని జీర్జించుకోలేకపోయానని తెలిపాడు. ఆ పరాజయం తనను వెంటాడిందని చెప్పాడు. 7 నుంచి 10 రోజుల వరకు నిద్ర లేస్తే అదే విషయం వెంటాడేదన్నాడు. అయితే జీవితం మారుతుందుని, ముందుకు సాగుతుందని చెప్పాడు.
మరోవైపు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్థి టీమ్‌ను మట్టికరిపించాడు. ఈ మ్యాచ్‌లో 2.5 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్ 17 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
"నాకు దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆడే అవకాశం వచ్చింది. నేను ఇక్కడ చివరిసారిగా 2018లో ఆడాను. కాబట్టి నాకు ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసు. క్రికెట్‌లో మీరు కోరుకున్నది ఎప్పటికీ జరగదు. మీరు అలాంటి వాటి నుంచి నేర్చుకుంటారు. భవిష్యత్ మ్యాచ్‌లలో నేర్చుకున్న వాటిని అమలు చేయాలి' అని మ్యాచ్ తర్వాత చెప్పాడు కుల్దీప్.