బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడో వన్డేకు సంబంధించిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ వైదొలిగాడు. దీంతో కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించనున్నాడు. అయితే హిట్‌మ్యాన్‌తో పాటు గాయాల కారణంగా దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ కూడా మూడో మ్యాచ్‌కు దూరమయ్యారు. కానీ మరో విశేషమేమిటంటే జట్టులో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని బోర్డు తెలిపింది.
అలానే రోహిత్ గాయంపై బీసీసీఐ స్పందిస్తూ.. "రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా బంగ్లా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ వేలికి గాయమైంది. వెంటనే స్థానిక ఆసుపత్రిలో స్కానింగ్ తీయించుకొని వచ్చాడు. అయితే తదుపరి చికిత్స కోసం రోహిత్ ముంబయికి వెళ్లాడు. దీంతో శనివారం జరిగే మూడో వన్డేలో ఆడడు. అయితే టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదో అనేది ఇప్పుడే చెప్పలేం. అలాగే కుల్దీప్‌సేన్, దీపక్ చాహర్ కూడా చివరి వన్డేకు అందుబాటులో ఉండరు. మొదటి వన్డే ముగిసిన తర్వాత కుల్దీప్ సేన్ వెన్ను నొప్పిగా ఉన్నట్లు మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకొచ్చాడు. అందుకే రెండో మ్యాచ్‌లో అతడికి విశ్రాంతి ఇచ్చాం. వైద్య బృందం సూచనల మేరకు చివరి మ్యాచ్‌కూ రెస్ట్ ఇచ్చాం. దీంతో దీపక్ చాహర్‌తో పాటు కుల్దీప్ ఎన్‌సీఏకి వెళ్తారు" అని వెల్లడించింది.
భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్.