కొవిడ్‌తో పోరాడుతున్న బాధితులకు సాయం చేయడానికి టీమ్ఇండియా క్రికెటర్లు హర్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య.. మరోసారి ముందుకొచ్చారు. ఆక్సిజన్ సంక్షోభంలో ఉన్న కేంద్రాలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిణీ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు.
"కొవిడ్‌తో బాధపడుతున్న వారికి అందించేందుకు మరికొన్ని ఆక్సిజన్ కాన్సట్రేటర్లను పంపిణీ చేస్తున్నాం. వారందరూ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం" అని కృనాల్ ట్వీట్ చేశాడు.