Hemang badani bat టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ (క్రిస్) షాట్ కొట్టే సమయంలో పొరపాటున మరో మాజీ ప్లేయర్ హేమంగ్ బదానీ చేతికి బ్యాట్ తగిలింది. పాపం నొప్పితో బదానీ విలవిల్లాడిపోయాడు. అదేంటి వీరిద్దరూ ఎప్పుడు క్రికెట్ ఆడారు..? ఎక్కడ ఆడారు..? అని కంగారు పడిపోవద్దు.. శ్రీలంక-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ ప్రారంభం మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ బాక్స్‌లో ఓ షాట్ గురించి క్రిస్ వివరిస్తూ ఉంటాడు. అయితే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ పక్కనే ఉన్న హేమంగ్ బదానీ చేతికి పొరపాటున బ్యాట్ తగిలింది. ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అనిపించడంతో బదానీ మోచేతిని పట్టుకుని బాధపడిపోయాడు. వెంటనే అతడిని వైద్య సహాయం నిమిత్తం అక్కడి నుంచి తరలించారు.
బ్యాట్ తగిలి మాజీ క్రికెటర్ విలవిల, వీడియో వైరల్ - హేమంగ్ బదాని
కామెంటరీ చేస్తుండగా బ్యాట్ తగిలి ఓ మాజీ క్రికెటర్ నొప్పితో విలవిలలాడాడు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
తనకు దెబ్బ తగిలిన పరిస్థితిపై హేమంగ్ బదానీ ట్విటర్ వేదికగా స్పందించాడు. "నా గాయం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. బ్యాట్ తగిలినప్పుడు చాలా నొప్పిగా అనిపించింది. అయితే ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదు. వెంటనే వైద్య చికిత్స తీసుకున్నా. త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తా" అని ట్వీట్ చేశాడు. అయితే గాయంతో బాధపడుతున్న వీడియో సోషల్ మీడియాలో క్రికెట్ అభిమాని షేర్ చేశాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి.
ఇదీ చూడండి:లక్ష్య అథ్లెట్ల హవా, 44 స్వర్ణాలు సహా 121 పతకాలు కైవసం