Kohli vs South Africa: టీమ్ఇండియా టెస్టు సారథి కోహ్లీ అభిమానులను నిరాశపరిచే వార్త ఒకటి నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు వెన్నునొప్పి కారణంగా దూరమైన విరాట్.. వన్డే సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని తెలిసింది. కుటుంబంతో గడపాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ విషయం గురించి ఇప్పటికే బీసీసీఐకు సమాచారం కూడా ఇచ్చాడని తెలుస్తోంది. కాగా, మరి మూడో టెస్టుకు కూడా అందుబాటులో ఉంటాడో లేదో కూడా స్పష్టత లేదు.
ఇప్పటికే వన్డే సిరీస్‌కు గాయం కారణంగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.