భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీపై(Virat Kohli) ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్(Shane Warne) ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ఆడినంత కాలం టెస్టు క్రికెట్‌కు ఢోకాలేదని పేర్కొన్నాడు. 'క్రీడల్లో నమ్మకం చాలా ముఖ్యం. కెప్టెన్‌పై నమ్మకం లేకపోతే ఎంత మంచి జట్టు ఉన్నా విజయం సాధించలేము. భారత క్రికెట్ జట్టు సారథిగా విరాట్ కోహ్లీ జట్టు సభ్యుల విశ్వాసాన్ని సంపాదించాడు. అతడు జట్టును నడిపించే తీరు అమోఘం. ఆటగాళ్లంతా అతడిని గౌరవిస్తారు. వాళ్లంతా అతడి వెన్నంటే ఉంటూ.. సమష్టిగా రాణిస్తున్నారు. కెప్టెన్‌కు అండగా ఉండే ఆటగాళ్లు దొరకడం గొప్ప విషయం. కోహ్లీ క్రికెట్ ఆడినంత కాలం టెస్టు మ్యాచులకు ఢోకా లేదు. మరింత ఎక్కువ కాలం క్రికెట్ ఆడండి కోహ్లీ' అని వార్న్(Shane Warne Virat Kohli) అన్నాడు.
ఇటీవల ముగిసిన ఓవల్ టెస్టులో 157 పరుగుల తేడాతో టీమిండియా ఇంగ్లాండ్‌పై(Ind vs Eng 4th test) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో విదేశీ గడ్డపై 15 విజయాలతో.. అత్యంత విజయవంతమైన భారతీయ కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
'కోహ్లీ ఆడినంత కాలం.. టెస్టు క్రికెట్‌కు ఢోకా లేదు'
కోహ్లీ ఆడినంత కాలం టెస్టు క్రికెట్‌కు ఢోకాలేదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్(Shane Warne) అన్నాడు. సారథిగా విరాట్ జట్టు సభ్యుల విశ్వాసాన్ని సంపాదించాడని ప్రశంసించాడు.
విరాట్, షేన్ వార్న్