తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టు కెప్టెన్సీ రేసులో ఉన్నది ఈ ఆటగాళ్లే!

Kohli Test Captaincy race: విరాట్ కోహ్లీ.. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకొంటూ అభిమానులను షాక్​కు గురిచేశాడు. దీంతో ఆ స్థానంలో ఎవరిని భర్తీ చేస్తారనే విషయమై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం క్రికెట్​ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నలుగురు క్రికెటర్ల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వారెవరంటే..

Kohli Test Captaincy race
టెస్టు కెప్టెన్సీ రేసు

By

Published : Jan 16, 2022, 10:39 PM IST

Updated : Jan 17, 2022, 11:44 AM IST

Kohli Test Captaincy race: టీమ్​ఇండియా టెస్టు సారథిగా విరాట్​ కోహ్లీ తప్పుకున్న నేపథ్యంలో ఆ స్థానంలో బీసీసీఐ ఎవరికి బాధ్యతలు అప్పగిస్తుందనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇదే విషయం క్రికెట్​ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కాగా, ఈ టెస్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్​ తప్పుకున్న నేపథ్యంలో బీసీసీఐ ముందు కొత్త సవాలు వచ్చి పడినట్లైంది. ఎందుకంటే త్వరలోనే శ్రీలంకకు టెస్టు సిరీస్​ను ఆతిథ్యమివ్వనుంది భారత్​. దీంతో ఈలోపే కొత్త బాధ్యతల్ని మరొక ఆటగాడికి అప్పగించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ కెప్టెన్సీ రేసులో పలువురు ఆటగాళ్ల పేర్లు వినపడుతున్నాయి. మరి వారెవరంటే..

రోహిత్​ శర్మ(Rohith sharma test captaincy race)

ప్రస్తుతం వన్డే, టీ20ల్లో రోహిత్​శర్మకు కెప్టెన్​ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. దీంతో టెస్టు జట్టుకు కూడా హిట్​మ్యాన్​ను సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేఎల్​ రాహుల్(Kl rahul test captaincy race)

టెస్టు కెప్టెన్​ పదవికి రోహిత్​ శర్మ తర్వాత రేసులో ఉన్నది కేఎల్​ రాహులే​. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకు కోహ్లీ, రోహిత్​ దూరమైన నేపథ్యంలో అతడే జట్టును ముందుండి నడింపించాడు. అతడికి ఐపీఎల్​లోనూ సారథిగా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది. కాబట్టి అతడికి పగ్గాలు అప్పగింటే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిషబ్​ పంత్(rishab patn Test Captaincy race)
దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించే యువక్రికెటర్​ రిషబ్​ పంత్​ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు క్రికెట్​ వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్న వయసులోనే బాధ్యతలు అప్పగించడం ద్వారా భవిష్యత్తులో సారథిగా అతడు​ కీలక పాత్ర పోషిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే అతడు ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు.

బుమ్రా(Bumrah test captaincy race)

ఈ రేసులో బౌలర్​ బుమ్రా పేరు కూడా వినిపిస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకు అతడు వైస్​కెప్టెన్​గా బాధ్యతలు నిర్వర్తించాడు.

మరి వీరిలో బీసీసీఐ ఎవరికి పగ్గాలు అప్పగిస్తుందో తెలియాలంటే.. బోర్డు అధికార ప్రకటన చేసే వరకు వేచి ఉంటాల్సిందే.

ఇదీ చూడండి: ఈ బల్లెం భామను చూస్తే ఎవరైనా టెంప్ట్ ​అవ్వాల్సిందే!

Last Updated : Jan 17, 2022, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details