Virat Kohli 100th test: రెండేళ్లుగా విరాట్ కోహ్లీ సెంచరీ కోసం నిరీక్షిస్తున్న అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో అతడు 45 పరుగలకే వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్ 44వ ఓవర్లో లంక స్పిన్నర్ ఎంబుల్దేనియా వేసిన బంతికి క్లీక్ బౌల్డ్‌గా వెనుదరిగాడు.
8వేల పరుగుల మైలురాయి..
దీంతో విరాట్ చారిత్రక ఇన్నింగ్స్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఈ మ్యాచ్‌లో 8000 పరుగులు మైలురాయిని మాత్రం కోహ్లీ అధిగమించాడు. 38 పరగుల వద్ద ఈ రికార్డును చేరుకున్నాడు.