స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా.. క్రికెటర్లు డ్యాన్స్ వేడయం కొత్తేమీ కాదు. టీమ్అఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా.. ఇంటర్నేషనల్ మ్యాచులు అయినా.. ఐపీఎల్ మ్యాచ్ అయినా.. అప్పుడప్పుడు మైదానంలో చిందులేస్తుంటాడు. ఇప్పుడు ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలోనూ కోహ్లీ తన కాలును కదిపాడు. ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటుట సాంగ్‌కు విరాట్ స్టెప్పులేశాడు. ఓవర్ ముగిసిన తర్వాత వచ్చిన చిన్న బ్రేక్‌లో స్లిప్‌లో నిలబడిన విరాట్ 'నాటు నాటు' స్టెప్ వేస్తూ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
మిచెల్ స్టార్క్ అరుదైన మార్క్.. ఇక ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ఇండియా ఆచితూచి ఆడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఓ అరుదైన మార్క్‌ను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక వికెట్లు తీసిన నాలుగో ఆసీస్ బౌలర్‌గా రికార్డుకెక్కాడు. కోహ్లీని ఔట్ చేసిన అనంతరం.. అతడు ఈ ఘతన సాధించాడు. ఇప్పటివరకు వన్డే, టెస్టులు, టీ20లు కలిపి మొత్తంగా 591 వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ జాబితాలో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ 999 వికెట్లతో అగ్ర స్థానంలో నిలవగా.. గ్లెన్ మెక్‌గ్రాత్ 948 వికెట్లు(రెండో స్థానం), బ్రెట్ లీ 718 వికెట్లు(మూడో స్థానం), మిచెల్ స్టార్క్(591 వికెట్లు) నాలుగో స్థానం, మిచెల్ జాన్సన్ 590 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.