టీమ్ఇండియా స్టార్ హిట్టర్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్లలో ఎవరు బెస్ట్ అనే చర్చ నడుస్తోంది. ఈ చర్చకు తెరదించుతూ భారత మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్ తన తీర్పును ఇచ్చారు. అజామ్ కన్నా విరాట్ కోహ్లీనే బెస్ట్ అని చెప్పేశాడు. క్రికెట్ సామర్థ్యాల్లో విరాట్ మందంజలో ఉన్నాడని చెప్పారు. కోహ్లీ చాలా అనుభవం ఉన్నవాడని.. అది అతడి గణాంకాలు చూస్తే అర్థమౌతుందని అన్నారు. అందుకే బాబర్ అజామ్ కన్నా.. విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడని చెప్పారు. అలాగే బాబర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు.
'కోహ్లీ చాలా అనుభవజ్ఞుడైన ప్లేయర్. అతడి గణాంకాలు చాలా ఎక్కువ. విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్‌ను పోల్చడం ఎప్పుడూ కష్టమే. వీరిద్దరూ చాలా భిన్నమైన ఆటగాళ్లు. బాబర్‌తో పోలిస్తే.. కోహ్లీ కాస్త మెరుగైన ఆటగాడు. అతడు ఎప్పుడూ నేర్చుకోవాలనే ఆసక్తితో ఉంటాడు. 2019 ప్రపంచకప్‌లో మ్యాచ్ తర్వాత అతడు నాతో మాట్లాడాడు. కోహ్లీ నేర్చుకోవాలనే ఆసక్తితో ఉంటాడని నేను ఎప్పుడూ చెబుతుంటాను.. అందుకే విరాట్ అన్ని ఫార్మాట్లలో రాణించడం ఆశ్చర్యమేమీ లేదు. కోహ్లీ చాలా టాలెంటెడ్ ప్లేయర్.'