ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన విరాట్ కోహ్లీతో తనను పోల్చడం పట్ల చాలా ఆనందంగా ఉందని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అన్నాడు. కోహ్లీ లాంటి అద్భుతమైన బ్యాట్స్‌మన్‌తో తన ఆటను పోల్చడం పట్ల గర్వంగా భావిస్తున్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
"ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లులో విరాట్ కోహ్లీ ఒకరు. ప్రతి మ్యాచ్‌లోనూ అతడు ఉత్తమంగా రాణిస్తాడు. అయితే క్రికెట్ అభిమానులు ఎప్పుడైతే మా ఇద్దరి పోల్చినప్పుడు నాపై ఒత్తిడి పెరగదు. ఎందుకంటే కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడితో నన్ను పోల్చుకోవడాన్ని గర్వంగా భావిస్తా. వ్యక్తిగతంగా మరో ఆటగాడితో నన్ను పోల్చుకోవడం నాకు నచ్చదు. కానీ, అభిమానులు కోహ్లీతో పోలుస్తుంటే నాకు సంతోషంగా ఉంది. కోహ్లీని నన్ను వేర్వేరుగా చూస్తే ఎవరి బ్యాటింగ్ స్టైల్ వారికి ఉంటుంది. కాబట్టి బ్యాటింగ్‌లో గొప్పగా రాణించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా".