భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్ అని వ్యాఖ్యానించాడు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్. తన ఆటతో ప్రత్యర్థి జట్టును మైమరపిస్తాడని అన్నాడు. ఓ కార్యక్రమంలో భాగంగా 2018-19లో భారత్.. ఆస్ట్రేలియా పర్యటనను గుర్తుచేసుకుంటూ.. గట్టి పోటీ ఇచ్చే విరాట్ ను ఎన్నటికీ మర్చిపోనని చెప్పాడు.
"కోహ్లీ గురించి ఈ విషయం చాలా సార్లు చెప్పాను. అతడిని ఎవరైనా తమ జట్టులో కోరుకుంటారు. పోటీతత్వం ఉన్నవాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్. అతడితో ఆడటం సవాలుతో కూడినది. తన ప్రదర్శనతో ప్రత్యర్థిని ఆకట్టుకోగలడు. నాలుగేళ్ల కింద అతడితో గొడవ జరిగింది. అతడిని నేనెప్పుడూ గుర్తుపెట్టుకుంటాను."