తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ కోలుకుంటున్నాడు.. త్వరలోనే ఆడతాడు: పుజారా

Kohli injury update: వెన్నునొప్పితో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్​ కోహ్లీ కోలుకుంటున్నాడని తెలిపాడు టీమ్​ఇండియా ఆటగాడు పుజారా. దీంతో పాటే ఫామ్​ కోల్పోయి ఇబ్బంది పడుతున్న రహానె, తన గురించి కూడా మాట్లాడాడు. తమలో ఆత్మవిశ్వాసం, టీమ్​మేనేజ్​మెంట్​ నుంచి ప్రోత్సాహం ఉందని అన్నాడు.

kohli
కోహ్లీ

By

Published : Jan 6, 2022, 7:23 AM IST

Updated : Jan 6, 2022, 7:29 AM IST

Kohli injury update: వెన్నునొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు దూరమైన సారథి కోహ్లీ కోలుకుంటున్నాడని తెలిపాడు టీమ్​ఇండియా బ్యాటర్​ పుజారా. త్వరలోనే పూర్తి ఫిట్​నెస్​ సాధించి ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"అధికారికంగా నేనేమి చెప్పలేను కానీ అతడు కోలుకుంటున్నాడు. త్వరలోనే అతడు పూర్తి ఫిట్​నెస్​ సాధిస్తాడని భావిస్తున్నా. విరాట్​ ఇప్పుడు ఎలా ఉన్నాడనేది ఫిజియోలే చెప్పాలి" అని పుజారా అన్నాడు.

గత కొద్దికాలంగా పుజారా, రహానె ఫామ్​ కోల్పోయి పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్​లో సరిగ్గా రాణించలేకపోతే జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని ​వ్యాఖ్యలు చేశాడు. 'ఈ వ్యాఖ్యలు మీపై ఒత్తిడి చూపాయా' అని అడిగిన ప్రశ్నకు పుజారా స్పందిస్తూ... "మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. టీమ్​మేనేజ్​మెంట్, కెప్టెన్​, కోచింగ్​ బృందం నుంచి మాకు మద్దతు, ప్రోత్సాహం ఉంది. ఆటగాళ్లకు వారి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సన్నీ భాయ్​ నుంచి ఎప్పడూ నేర్చుకుంటూనే ఉన్నాం. ఆయనెప్పుడూ మాకు అండగానే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఫామ్​ కోల్పోయి ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఎన్నో ప్రశ్నలు ఎదురౌతాయి. కానీ మేము ఆత్మవిశ్వాసంతోనే ఉంటాం. నేను, రహానె ఎంతో కష్టపడతామో మాకు తెలుసు. ఫామ్​ అనేది తాత్కాలికం కానీ క్లాస్​ శాస్వతం. అదే నిజం." అని పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: 'కోహ్లీ వందో టెస్టుకు అలా జరగాలని ఆశిస్తున్నా'

Last Updated : Jan 6, 2022, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details