పాకిస్థాన్‌పై విరోచిత ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చిన విరాట్ కోహ్లీ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు.. 14వ స్థానంలో ఉన్న అతడు పాక్‌పై ఆడిన ఒక్క ఇన్నింగ్స్‌తో టాప్10లో చోటు దక్కించుకన్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్‌లో అతడు 635 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
గతేడాది నవంబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ అనంతరం కోహ్లీ, ఐసీసీ టీ 20 టాప్ 10 ర్యాంకింగ్స్‌లో చోటు కోల్పోయాడు. ఏడాది తర్వాత అదే ఐసీసీ టోర్నీలో రాణించి తిరిగి టాప్-10లోకి దూసుకెళ్లాడు. మొన్నటిదాకా రెండో స్థానంలో ఉన్న స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 828 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు.