టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో(T20 world cup 2021 latest news) భారత్ పరాజయం చెందడం వల్ల టీమ్ఇండియాపై విమర్శలు వస్తున్నాయి. అయితే కొందరు.. ఆటలో గెలుపోటములు సహజమని సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ జట్టు సారథి కోహ్లీ కెప్టెన్సీపై(Virat Kohli captaincy news) ప్రశంసలు కురిపించింది పాక్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సనా మీర్. విరాట్‌ది(Virat Kohli news) గొప్ప మనసని, ఓటమిని హుందాగా అంగీకరించి ఆదర్శంగా నిలిచాడని కొనియాడింది.
పాకిస్థాన్‌తో మ్యాచ్ ముగిశాక రిజ్వాన్, బాబర్‌ల ఆటతీరును ప్రశంసిస్తూ వారిని హత్తుకున్నాడు. షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే సనా ఈ వ్యాఖ్యలు చేసింది.
"విరాట్ కోహ్లి చాలా హుందాగా ఓటమిని అంగీకరించాడు. అతడి క్రీడాస్ఫూర్తిని నేను అభినందిస్తున్నాను. రోల్ మోడల్స్, అగ్రశ్రేణి ఆటగాడు అయిన అతడు.. ప్రత్యర్థి ఆటగాళ్లను హగ్ చేసుకుని అభినందించడం నిజంగా చాలా బాగుంది. ఇది తనలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం" అని సనా పేర్కొంది.