తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ కన్నా బాబ‌ర్ బెస్ట్!'.. సౌతాఫ్రికా బ్యాటర్​ కామెంట్స్‌పై విరాట్​ ఫ్యాన్స్ ఫుల్​ ఫైర్‌ - Kohli Fans Fire On southafrica cricketer david Miller

టీమ్​ఇండియా మాజీ సారథి విరాట్​ కోహ్లీ కన్నా పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్ బెస్ట్​ అంటూ దక్షిణాఫ్రికా క్రికెటర్​ డేవిడ్​ మిల్లర్​ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్​గా మారాయి. దీనిపై టీమ్​ఇండియా ఫ్యాన్స్​ మండిపడుతున్నారు. అతడిని తెగ ట్రోల్​ చేస్తున్నారు.

Kohli Fans Fire On southafrica cricketer david Miller
Kohli Fans Fire On southafrica cricketer david Miller

By

Published : Feb 25, 2023, 9:32 AM IST

Updated : Feb 25, 2023, 9:39 AM IST

అంతర్జాతీయ క్రికెట్​లో టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ, పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​.. తమ ఫామ్​ను కొనసాగిస్తున్నారు. వీరిద్దరి ఆటతీరు, రికార్డుల విషయంలో చాలా వరకు పోలికలు కూడా ఉంటాయి. తాజాగా కోహ్లీ, బాబ‌ర్​ల‌లో ఎవ‌రు గొప్ప అనే విష‌యంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండ‌ర్ డేవిడ్ మిల్ల‌ర్ చేసిన కామెంట్స్ వైరల్​గా మారాయి. అవి టీమ్​ఇండియా ఫ్యాన్స్‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తున్నాయి.

పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్ టీమ్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న డేవిడ్ మిల్ల‌ర్ ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశాడు. క‌వ‌ర్ డ్రైవ్ ఆడే విష‌యంలో కోహ్లీ, బాబ‌ర్​లో ఎవ‌రు బెస్ట్ అంటూ అడిగిన ప్ర‌శ్న‌కు బాబ‌ర్ అంటూ స‌మాధానం చెప్పాడు. మిల్ల‌ర్‌ స‌మాధానంతో బాబ‌ర్ ఫ్యాన్స్ ఖుషీ అయినా కోహ్లీ అభిమానులు మాత్రం అత‌డిని గ‌ట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పాకిస్థాన్ లీగ్‌లో ఆడుతున్న మిల్ల‌ర్ అక్క‌డి ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేయ‌డానికి కావాల‌నే కోహ్లీని త‌క్కువ చేశాడంటూ చెబుతున్నారు.

కోహ్లీకి బాబ‌ర్ ఎప్ప‌టికీ పోటీ కాద‌ని ఫ్యాన్స్​ అంటున్నారు. ఆ వాస్త‌వాన్ని మిల్ల‌ర్ తెలుసుకుంటే మంచిదంటూ విమ‌ర్శిస్తున్నారు. ఇదే ఇంట‌ర్వ్యూలో యార్క‌ర్స్ విష‌యంలో అఫ్రిది, బుమ్రాలో ఎవ‌రు బెస్ట్ అని అడిగిన ప్ర‌శ్న‌కు బుమ్రా అంటూ స‌మాధానం చెప్పాడు మిల్ల‌ర్‌.

Last Updated : Feb 25, 2023, 9:39 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details