తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాపం కోహ్లీ.. ఓటమికి కారణాలు చెప్పిన కెప్టెన్​ రోహిత్​ - రోహిత్​ శర్మ శ్రీలంకమ్యాచ్​

ఆసియా కప్​లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో విరాట్​ కోహ్లీ ఓ పేలవ రికార్డును నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఈ మ్యాచ్​లో భారత జట్టు ఓటమికి గల కారణాన్ని తెలిపాడు కెప్టెన్ రోహిత్​ శర్మ.

kohli rohith
కోహ్లీ రోహిత్​

By

Published : Sep 7, 2022, 10:57 AM IST

ఆసియాకప్‌-2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమ్​ఇండియా 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఫైనల్‌ చేరే అవకాశాలను భారత్‌ చేజార్చుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్​ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్‌లో మధుశంక వేసిన ఓ అద్భుతమైన బంతికి విరాట్​ క్లీన్‌ బౌల్డయ్యాడు. తద్వారా ఆసియాకప్‌లో ఓ చెత్త రికార్డును కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాకప్‌ వన్డే, టీ20 ఫార్మాట్‌లో డకౌటైన తొలి ఆటగాడిగా నిలిచాడు. తొలి

అయితే ఈ మ్యాచ్​లో భారత్ ఓడిపోవడానికి కారణాన్ని తెలిపాడు కెప్టెన్ రోహిత్ శర్మ. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఒక బంతి మిగిలి ఉండగానే శ్రీలంక 174/4తో ఛేదించేసింది. ఈ ఓటమితో భారత్ జట్టు ఫైనల్ అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఇప్పటికే పాకిస్థాన్ చేతిలోనూ సూపర్-4లో టీమ్​ఇండియా ఓడిపోయింది.

భారత్ జట్టు ఓటమి తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ "మొదటి ఆరు ఓవర్లలో మేము ఆశించినంత స్కోరు చేయలేకపోయాం. దానికి కారణం ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకోవడమే. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో స్కోరు వచ్చినా.. చివర్లో మళ్లీ ఆ లయ దెబ్బతింది. దీంతో ఆశించిన దానికంటే ఓ 10-12 పరుగులు తక్కువ చేశాం. కానీ.. శ్రీలంకకు మంచి శుభారంభం దక్కింది. దాంతో మేము ఒత్తిడిలో పడిపోయాం. కానీ స్పిన్నర్లు మళ్లీ మమ్మల్ని మ్యాచ్‌లోకి తెచ్చారు. అయితే మ్యాచ్‌ను సరిగా ముగించలేకపోయాం" అని రోహిత్ శర్మ వెల్లడించాడు.

పవర్‌ప్లేలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (6: 7 బంతుల్లో 1x4), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (0: 4 బంతుల్లో) వికెట్లను భారత్ జట్టు చేజార్చుకుంది. కానీ.. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (34: 29 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ (72: 41 బంతుల్లో 5x4, 1x6) మూడో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ.. ఆ తర్వాత రిషబ్ పంత్ (17), హార్దిక్ పాండ్య (17), దీపక్ హుడా (3) తక్కువ స్కోరుకే ఔటైపోవడం వల్ల భారత్ 173 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇదీ చూడండి: ఇది ప్రపంచ కప్​ తెచ్చే జట్టేనా?.. ఒక్కసారిగా తగ్గిన ఆశలు!

ABOUT THE AUTHOR

...view details