తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెగాస్టార్ క్రేజ్​..​ చిరంజీవి సాంగ్స్​కు కోహ్లీ డ్యాన్స్​! - మెగాస్టార్ చిరంజీవి సాంగ్స్​కు కోహ్లీ డ్యాన్స్​

Megastar Chiranjeevi Kohli dance: మెగస్టార్​ చిరంజీవి సాంగ్స్​, డ్యాన్స్​కు ఎలాంటి క్రేజ్​ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు ఆయనలా అనుకరిస్తూ.. ఆ పాటలకు ఇప్పటికీ చిందులేస్తుంటారు. అయితే టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కూడా చిరు సాంగ్స్​కు అదిరే స్టెప్పులేసేవాడట. ఆ సంగతేంటో చూద్దాం..

Kohli dance for Megastar Chiranjeevi songs
మెగాస్టార్​ చిరంజీవి సాంగ్స్​కు కోహ్లీ డ్యాన్స్​

By

Published : Jul 13, 2022, 9:51 AM IST

Updated : Jul 13, 2022, 10:22 AM IST

Megastar Chiranjeevi Kohli dance: మెగాస్టార్​ చిరంజీవి.. టాలీవుడ్​లోనే కాదు భారత చిత్రసీమలో ఈ పేరుకు స్పెషల్​ క్రేజ్​ ఉంది. విరాట్​ కోహ్లీ.. అలానే ఈ పేరుకు కూడా భారత క్రికెట్​లో సూపర్​ ఫ్యాన్​ ఫాలోయింగ్ ఉంది. అయితే చిరు పాటకు విరాట్​ స్టెప్పులెేస్తే..​ ఎలా ఉంటుంది? ఆ ఊహే సూపర్ ఉంది కదూ. అవును కోహ్లీ నిజంగానే మెగాస్టార్​ సాంగ్స్​కు అప్పట్లో విపరీతంగా ఇష్టపడేవాడట! తెగ చిందులేసేవాడట.

ఈ విషయాన్ని విరాట్​ స్నేహితుడు, రూమ్​మేట్​ అయిన తెలుగు క్రికెటర్​ ద్వారక రవితేజ తెలిపాడు. చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోలు దిగగా.. వాటిని రవితేజ తన ఇన్​స్టాలో పోస్ట్​ చేసి నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.

"ఆరేళ్ల తర్వాత మేము కలుసుకున్నాం. వెంటనే అతడు ఏ చిరు ఎలా ఉన్నావు? అంటూ ఆప్యాయంగా పలకరించాడు. అండర్​-15లో మేం రూమ్​మేట్స్​గా ఉన్నప్పుడు నేను ఎక్కువగా టీవీలో చిరంజీవి సాంగ్స్​ను చూసేవాడిని. అప్పుడు కోహ్లీ ఆ పాటలకు తెగ డ్యాన్స్​ వేసేవాడు. అప్పటి నుంచి మేము మా అసలైన పేర్లతో పిలుచుకోము. ఒకరినొకరు చిరు అని పిలుచుకుంటాము. ఆ మధుర జ్ఞాపకాలు.. ఇన్నాళ్లైనా అలానే ఉన్నాయి. ఏదీ మారలేదు. నిన్ను చూడటం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే మళ్లీ మనం కలుస్తాం అని ఆశిస్తున్నాను చిరు" అంటూ వ్యాఖ్య రాసుకొచ్చాడు రవితేజ.

ఇదీ చూడండి: రోహిత్​ భారీ సిక్సర్​.. చిన్నారికి గాయం.. నొప్పితో విలవిల్లాడుతూ..

Last Updated : Jul 13, 2022, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details