Kohli Centuries In 2023 : ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ పేరు ఎప్పుడు సంచలనమే. ఎన్నో అద్భుతమైన రికార్డులను అందుకున్నాడు. దిగ్గజ క్రికెటర్ల రికార్డులను బ్రేక్ చేశాడు. ఎన్నో ఘనతలతో దశాబ్ద కాలం పాటు మకుటం లేని మారాజుగా కొనసాగిన అతడు కూడా కెరీర్లో బ్యాడ్ ఫేస్‌ను ఎదుర్కొన్నాడు. సెంచరీల కింగ్ అనే ట్యాగ్ లైన్ ఎప్పుడూ మెడలో వేసుకుని తిరిగే అతడు.. దాదాపు మూడేళ్ల పాటు శతకం బాదడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. ఆఖరికి కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. కానీ అవేమీ అతడిని ఏం చేయలేకపోయాయి. విరాట్ తన ఆత్మస్థైర్యాన్ని అస్సలు కోల్పోలేదు. ఓపిగ్గా అన్ని పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. 2019-2022 వరకు తనను వెంటాడిన బ్యాడ్‌టైమ్‌ను మళ్లీ బ్యాట్‌తోనే గట్టి సమాధానం చెప్పాడు.
Kohli Centuries : కింగ్ కోహ్లీ ఎప్పుడూ నెం.1.. ఏడాది కాలంలో 7 రికార్డ్ సెంచరీలు
Kohli Centuries In 2023 : ఆసియా కప్‌లో భాగంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ రికార్డ్ సెంచరీ బాదాడు. అయితే ఈ ఫీట్‌తో పలు రికార్డులను తన ఖాతాలే వేసుకున్నాడు. ఆ వివరాలు..
Published : Sep 11, 2023, 8:37 PM IST
2022 ఆసియా కప్‌లో టీ20 ఫార్మాట్లో ఆఫ్ఘానిస్థాన్‌పై సెంచరీ బాది మునపటి ఫామ్‌ను అందుకున్నాడు. కోహ్లీకి అది అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకం కావడం విశేషం. ఇక మళ్లీ మొదలు. రన్ మెషీన్ అంటూ పరుగుల వరద పారించడం మొదలు పెట్టాడు. వరుసపెట్టి సెంచరీల మోత మోగిస్తూ దుసుకెళ్తున్నాడు. అప్ఘానిస్థాన్‌పై సెంచరీ బాదిన తర్వాత అదే ఏడాది బంగ్లాదేశ్‌పై కూడా వన్డేలో ఓ శతకం, ఈ ఏడాది(2023) స్వదేశంలో శ్రీలంకపై వన్డేల్లో రెండు శతకాలు, అనంతరం మళ్లీ స్వదేశంలో జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై టెస్ట్ సెంచరీ, ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో మరో టెస్ట్ సెంచరీ, ఇప్పుడు తాజాగా పాకిస్థాన్‌పై ఆసియా కప్‌లో రికార్డు సెంచరీ.. ఇలా వరుస పెటి శతకాలు బాదుతూ వస్తున్నాడు.
Asia cup 2023 IND VS PAK Kohli Century : ఈ తాజా సెంచరీతో అతడు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్‌లో 77వ శతకం కావడం విశేషం. వన్డేలో 13000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతడికి 47వ సెంచరీ. వన్డేల్లో అత్యంత వేగంగా 267 ఇన్నింగ్స్‌ల్లో ఈ సెంచరీల మార్క్‌ను అందుకున్నాడు. కొలొంబోలో వరుసగా ఇది అతడి నాలుగో శతకం. నిజానికి కోహ్లీ తన బ్యాడ్ టైమ్‌లోనూ సెంచరీ మాత్రమే చేయలేదు. హాఫ్ సెంచరీలు బాగానే చేశాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు చేశాడు.