తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీతో బ్యాటింగ్​.. పాకిస్థాన్​తో మ్యాచ్​ ఎప్పుడూ స్పెషలే: పంత్​

ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎలా ఎదుర్కోవాలో విరాట్​ కోహ్లీ చక్కగా నేర్పిస్తాడని టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ రిషభ్ పంత్​​ తెలిపాడు. కోహ్లీతో బ్యాటింగ్ చేయడం​ ఎలా ఉంటుందనే విషయంపై మాట్లాడాడు. ఇంకా ఏమన్నాడంటే?

T20 World Cup Kohli Pant
T20 World Cup Kohli Pant

By

Published : Oct 20, 2022, 11:01 AM IST

T20 World Cup Kohli Pant: ఒత్తిడి పరిస్థితుల్లో ఉన్నప్పుడు టీమ్​ఇండియా మాజీ సారథి విరాట్​ కోహ్లీకి ఉన్న అపారమైన అనుభవం తమకు దోహదం చేస్తుందని స్టార్​ బ్యాటర్​ రిషభ్​ పంత్​ తెలిపాడు. టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఆదివారం పాకిస్థాన్​తో జరగబోయే మ్యాచ్​లో మళ్లీ కోహ్లీతో కలిసి అద్భుతమైన బ్యాటింగ్​ భాగస్వామ్యాన్ని నమోదు చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు.

"వాస్తవానికి కోహ్లీ.. క్లిష్టమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నేర్పించగలడు. అది క్రికెట్​ కెరీర్​లో ఏ ప్లేయర్​కైనా తప్పక ఉపయోగపడుతుంది. అతడితో బ్యాటింగ్​ చేయడం ఎప్పుడూ బాగుంటుంది. ఎప్పుడైనా ఎక్కువ అనుభవం ఉన్న ప్లేయర్​తో ఆడడం చాలా బెటర్​. ఎందుకంటే వారి నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు."
-- రిషభ్​ పంత్​, స్టార్​ బ్యాటర్​

"గత ప్రపంచకప్​లో పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో హసన్ అలీ బౌలింగ్​లో ఒకే ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. నేను, కోహ్లీ కలిసి జట్టు రన్​రేట్​ పెంచడానికి చాలా ప్రయత్నించాం. 53 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాం. అయితే పాకిస్థాన్​తో మ్యాచ్​ ఆడడం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎందుకంటే ఆ మ్యాచ్​కు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు" అంటూ పంత్​ చెప్పుకొచ్చాడు.

ఇవీ చదవండి:T20 World Cup: సూపర్​-12లోకి ఏ జట్లు వెళ్లనున్నాయో?

విరాట్‌ కోహ్లీకి ఈ టీ20 ప్రపంచకప్‌ చివరిది కానుందా?

ABOUT THE AUTHOR

...view details