తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సౌతాఫ్రికాతో వన్డే సిరీస్​లో ఆడతా.. రోహిత్​తో ఎలాంటి గొడవలు లేవు'

Kohli respond on South Africa tour: దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్​కు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు టీమ్ఇండియా టెస్టు సారథి కోహ్లీ. తనకు విశ్రాంతి అవసరమని బీసీసీఐని కోరలేదని తెలిపాడు. అలాగే రోహిత్​తో విభేదాలపైనా మాట్లాడాడు.

కోహ్లీ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్​, kohli available on South Africa ODI Series
కోహ్లీ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్​

By

Published : Dec 15, 2021, 1:33 PM IST

Updated : Dec 15, 2021, 5:42 PM IST

విరాట్ కోహ్లీ

Kohli respond on South Africa tour: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ. రోహిత్​తో ఎలాంటి గొడవలు లేవని తెలిపాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. టెస్టు సిరీస్​కు రోహిత్ దూరమయ్యాడని.. అతడి సేవల్ని కోల్పోవడం పెద్ద లోటని తెలిపాడు.

"దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​కు అందుబాటులో ఉంటా. విశ్రాంతి కావాలని బీసీసీఐని కోరలేదు. సౌతాఫ్రికా టూర్​లో టెస్టు సిరీస్​లో భాగంగా రోహిత్ సేవల్ని కోల్పోవడం పెద్ద లోటు. పరిమిత ఓవర్ల కెప్టెన్​గా ఇప్పటివరకు నేనందించిన సేవల పట్ల గర్వంగా ఉంది. రోహిత్​కు, నాకూ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. రెండేళ్లుగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి అలసిపోయా" అని కోహ్లీ తెలిపాడు.

గంగూలీకి భిన్నంగా..

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దంటూ తాను కోహ్లీని కోరానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల వెల్లడించాడు. ఇదే విషయమై ప్రెస్ కాన్ఫరెన్స్​లో మాట్లాడిన కోహ్లీ.. తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని ఎవరూ కోరలేదని స్పష్టం చేశాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా గురువారం ఆ దేశం పయనమవనుంది భారత జట్టు. తర్వాత అక్కడ క్వారంటైన్​లో ఉండనుంది. ఈ నెల 26న ఇరుజట్ల మధ్య సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఈ పర్యటనలో మొత్తం మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది టీమ్ఇండియా. ప్రస్తుతం గాయం కారణంగా టెస్టు సిరీస్​కు దూరమైన రోహిత్ శర్మ.. వన్డే సిరీస్ ప్రారంభానికి కోలుకుని సౌతాఫ్రికాకు వెళతాడని బీసీసీఐ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: Virat Kohli Break: 'వన్డే సిరీస్​కు విశ్రాంతి కావాలని కోహ్లీ కోరలేదు'

Last Updated : Dec 15, 2021, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details