తెలంగాణ

telangana

బబుల్​ నుంచి టీమ్​ఇండియాకు 20రోజులు బ్రేక్​

By

Published : Jun 8, 2021, 1:29 PM IST

డబ్ల్యూటీసీ ఫైనల్​తో పాటు ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లిన టీమ్​ఇండియా ఆటగాళ్లలో మానసిక ఉల్లాసాన్ని నింపేందుకు.. బయోబుబుల్​ జీవితం నుంచి వారికి 20 రోజుల పాటు విముక్తి కల్పించనున్నారు. ప్రపంచటెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​, ఇంగ్లాండ్​ సిరీస్​ మధ్య దొరికే విరామ సమయంలో భారత జట్టు వారి కుటుంబాలతో కలిసి హాలీడే ట్రిప్​కు వెళ్లేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

teamindia
టీమ్​ఇండియా

డబ్ల్యూటీసీ ఫైనల్​ తర్వాత.. టీమ్​ఇండియాకు బయోబబుల్​ నుంచి కాస్త విముక్తి లభించనుంది. 20రోజుల పాటు వారు ఈ బుడగ జీవితానికి బ్రేక్​ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

ప్రస్తుతం భారత జట్టు జూన్​(18-22) జరగబోయే ప్రపంచటెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ కోసం సౌథాంప్టన్​లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయోబుడగలో సాధన చేస్తోంది. ఈ ఫైనల్​ పూర్తవ్వగానే అక్కడే ఉండి ఆగస్టు 4-సెప్టెంబరు 14వరకు ఇంగ్లాండ్​తో సిరీస్​ ఆడనున్నారు. ఈ రెండింటి మధ్య దాదాపు 40రోజుల పాటు ఆటగాళ్లకు విరామ సమయం దొరుకుతుంది. కాబట్టి ప్లేయర్స్ మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బుడగ నుంచి బయటకు వచ్చి వారు సరదాగా గడిపేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇందుకోసం జూన్​ 24-జులై 14వరకు 20రోజుల పాటు వారికి బ్రేక్​ ఇవ్వనున్నారు.

"న్యూజిలాండ్​తో ఫైనల్​ అవ్వగానే జున్​ 24నుంచి ఆటగాళ్లకు బుడగ జీవితం నుంచి విరామం ఇవ్వనున్నాం. మళ్లీ ఇంగ్లాండ్​ సిరీస్​ కోసం జులై 14న వారు తిరిగి బబుల్​లోకి అడుగుపెడతారు. ప్లేయర్స్​కు మానసిక విశ్రాంతి అవసరం. యూకే దాటి బయటకు వెళ్లడం కష్టం. అకస్మాతుగా కేసులు పెరిగి ప్రయాణ ఆంక్షలు విధిస్తే మళ్లీ తిరిగి రాలేము. కాబట్టి ఈ విరామ సమయాన్ని సరదాగా గడిపేందుకు యూకేలోని ప్రాంతాలను మాత్రమే పరిశీలిస్తున్నాం.

- బీసీసీఐ అధికారి.

ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లేముందుకు డబ్ల్యూటీసీ ఫైనల్​ తర్వాత బయోబబుల్​ నుంచి ఆటగాళ్లకు కాస్త విరామం ఉంటే బాగుంటుందని ఇప్పటికే సూచించాడు సారథి కోహ్లీ. నిరంతరం బుడగలో ఉండటం కష్టమని చెప్పాడు.

ఇదీ చూడండి:WTC Final: 'కోహ్లీసేనతో పోటీ కఠినమే'

ABOUT THE AUTHOR

...view details