గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకు కూడా దూరం కానున్నాడు. గాయం తీవ్రంగా ఉండటం వల్ల చికిత్స కోసం జర్మనీ వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా గురువారం ప్రకటించారు. ఈ నెలాఖరున లేదా జూలై మొదటివారంలో రాహుల్ జర్మనీకి వెళ్తాడని చెప్పారు.
భారత్‌కు షాక్! ఇంగ్లాండ్ పర్యటనకు స్టార్ ఓపెనర్ దూరం.. చికిత్స కోసం జర్మనీకి - కేఎల్ రాహుల్
కీలకమైన ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టీమ్ఇండియాకు గట్టి షాక్ తగిలింది! స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ పర్యటనకు కూడా దూరం కానున్నాడు. గాయం కారణంగా ఇప్పటికే సఫారీలతో సిరీస్‌కు దూరమైన అతడు.. చికిత్స కోసం జర్మనీ వెళ్లనున్నాడు.
రాహుల్
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమ్ఇండియా గతేడాది వాయిదా పడ్డ టెస్టుతో పాటు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక.. రాహుల్‌ను వైస్‌కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. అయితే ఇప్పుడు గాయం కారణంగా రాహుల్ దూరం కావడం వల్ల ఆ స్థానంలో బోర్డు మరొకరిని భర్తి చేయనుంది. అయితే ఎవరికి ఆ బాధ్యతలు అప్పగిస్తుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:కోహ్లీ.. ఆడాలని ఉందా లేదా?.. షాహిద్ అసహనం!