KL Rahul South Africa Series :సౌతాఫ్రికాలోని సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమ్ ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. 137 బంతుల్లో 101 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకుని స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో అటు క్రికెట్ లవర్స్‌తో పాటు ఇటు మాజీలు ఈ స్టార్ క్రికెటర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ ఇన్నింగ్స్‌పై స్పందించాడు. బౌలర్లకు పూర్తిగా అనుకూలిస్తున్న సెంచూరియన్ పిచ్‌పై రాహుల్ కళాత్మకమైన షాట్లతో అలరించాడంటూ అతడ్ని కొనియాడాడు.ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టి రాహుల్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
"లాఫ్టెడ్ డ్రైవ్‌లు, దూకుడైన పుల్‌షాట్లు, గోడకట్టినట్లున్న డిఫెన్స్, అద్భుతమైన స్థిరత్వం ఇలా రాహుల్ ఇన్నింగ్స్‌లో అన్నీ నాకు కనిపించాయి. టీమ్‌కు అవసరమైన సమయంలో అతడు అసాధారణ ఆటతీరును కనబరిచాడు. అంటూ ఇర్ఫాన్ పేర్కొన్నాడు.
మరోవైపు టీమ్ ఇండియా మాజీ బ్యాటర్ సంజయ్ బంగర్ కూడా ఈ స్టార్ క్రికెటర్ ఆట తీరుపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
"కొత్త బంతిని ఎదుర్కొనే విషయంలో అతడికి అద్భుతమైన అనుభవం ఉంది. దాదాపు 25 ఇన్నింగ్స్‌ల్లో అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆ అనుభవం అతడికి అత్యంత అమూల్యమైంది. అంతేకాకుండా 1-6 స్థానాల్లో ఎక్కడైనా సరే అతడు బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. అదే అతడిని వెల్ రౌండెడ్ ఆటగాడిగా తీర్చిదిద్దింది. ఆఫ్ స్టంప్ బయటకు వెళ్లే బంతుల విషయంలోనూ రాహుల్ డెసిషన్స్‌కు తిరుగులేదు. ఇవన్నీ నాణ్యమైన ఇన్నింగ్స్‌ను ఆడేందుకు ఉపయోగపడుతుంది" అని సంజయ్ వ్యాఖ్యానించాడు.
India Vs South Africa 1st Test : సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో భారత్ 245 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో రాహుల్ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా 137 బంతుల్లో 101 పరుగులు చేశాడు. వీటిల్లో 14 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. అలా క్రీజులో చెలరేగుతున్న రాహుల్ పదో వికెట్‌గా ఔటై పెవిలియన్ బాట పట్టాడు.
రాహుల్ 'ది సేవియర్'- సఫారీ గడ్డపై భారత్‌కు బ్యాక్‌బోన్‌గా స్టార్ బ్యాటర్
Cricketers Favourite Food : కేఎల్ రాహుల్‌కు పానీపూరి.. సూర్య కుమార్‌కు చైనీస్ ఆమ్లెట్.. మరి కోహ్లీ, రోహిత్‌కు ఏం ఇష్టమో తెలుసా?