తెలంగాణ

telangana

ETV Bharat / sports

Rohit Sharma: 'టీమ్​ఇండియా భవిష్యత్తు కెప్టెన్స్ వాళ్లే!' - శ్రీలంక

Rohit Sharma: టీమ్​ఇండియా భవిష్యత్తు సారథి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్​ రోహిత్ శర్మ. కేఎల్ రాహుల్, రిషభ్​ పంత్, జస్ప్రీత్ బుమ్రాలను కాబోయే కెప్టెన్లుగా చూస్తున్నట్లు చెప్పాడు. సారథిగా ఎదగడంలో ప్రతి ఒక్కరినీ ఎవరో ఒకరు తీర్చిదిద్దుతారని అన్నాడు.

Rohit Sharma
Bumrah

By

Published : Feb 23, 2022, 5:32 PM IST

Rohit Sharma: టీమ్​ఇండియాలో కేఎల్​ రాహుల్​, జస్ప్రీత్​ బుమ్రా, రిషభ్​ పంత్​లను భవిష్యత్తు కెప్టెన్లుగా చూస్తున్నట్లు తెలిపాడు కెప్టెన్ రోహిత్ శర్మ. శ్రీలంక పర్యటన నేపథ్యంలో గతవారమే టెస్టు కెప్టెన్​గా బాధ్యతలు అందుకున్నాడు 34 ఏళ్ల రోహిత్. అయితే భవిష్యత్తు సారథులను ఇప్పటి నుంచే అతడు తీర్చిదిద్దాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. శ్రీలంకతో టీ20 సిరీస్​ నేపథ్యంలో బుధవారం వర్చువల్​గా ప్రెస్​ కాన్ఫరెన్స్​లో మాట్లాడాడు రోహిత్.

"బుమ్రా, కేఎల్​ రాహుల్​, పంత్​.. టీమ్ఇండియా విజయపథంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. వారిని భవిష్యత్తు నాయకులుగా పరిగణిస్తున్నాం. తమపై ఉన్న బాధ్యత గురించి వారికి తెలుసు. అయితే వారిపై ఇప్పుడే ఎలాంటి ఒత్తిడి చేయదలచుకోలేదు. వారు ఆటను ఆస్వాదిస్తూ, నైపుణ్యాలను ప్రదర్శించాలని కోరుకుంటున్నాం."

-రోహిత్ శర్మ, టీమ్​ఇండియా కెప్టెన్

అది సహజమైన ప్రక్రియ..

రాహుల్, బుమ్రా, పంత్​లకు ప్రతి విషయాన్ని చెప్పాలనుకోవడం లేదని రోహిత్ అన్నాడు. "వారు తగినంత పరిణతి చెందారు. అవసరమైన సమయంలో వారిని గైడ్ చేసేందుకు సిద్ధంగా ఉంటా. ప్రతిఒక్కరినీ ఎవరో ఒకరు తీర్చిదిద్దాలి. అలాగే నేనూ ఈ స్థాయికి వచ్చాను. ఇది సహజమైన ప్రక్రియ. అందరికీ ఇది వర్తిస్తుంది"

బుమ్రా

అది ముఖ్యం కాదు..

స్టార్​ పేసర్​ జస్ప్రీత్​ బుమ్రా వైస్​ కెప్టెన్​గా నియామకం కావడంపైనా స్పందించాడు రోహిత్. వైస్​ కెప్టెన్​.. బౌలర్ బ్యాటర్ అనేది ముఖ్యం కాదని అన్నాడు. అది బుద్ధిపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ఆట గురించి బుమ్రాకు గొప్ప అవగాహన ఉందన్నాడు. ఆటను బుమ్రా మరో స్థాయికి తీసుకెళ్లాడని, దానిని మరింత కొనసాగిస్తాడనే నమ్మకముందని చెప్పాడు.

శ్రీలంకతో టీ20 సిరీస్​కు గాయాల కారణంగా సూర్యకుమార్​ యాదవ్, దీపక్​ చాహర్​ దూరమయ్యారు. విరాట్​ కోహ్లీ, రిషభ్ పంత్, శార్దూల్​ ఠాకూర్​లకు విశ్రాంతినిచ్చారు. టీ20 జట్టులో సంజూ శాంసన్​కు చోటు దక్కింది. ఫిబ్రవరి 24న తొలి మ్యాచ్​ జరగనుంది.

ఇదీ చూడండి:Rohit Sharma: ఆ ఫీలింగ్ గొప్పగా ఉంది: రోహిత్​ శర్మ

ABOUT THE AUTHOR

...view details