KL Rahul England rescheduled test: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న సిరీస్‌కు ముందు గాయపడ్డ కేఎల్ రాహుల్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్న అతడు వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే రీషెడ్యూల్ టెస్టుకు అందుబాటులో ఉండటం అనుమానంగానే ఉంది.
ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్ టెస్టు.. భారత స్టార్ ఓపెనర్ అనుమానమే!
KL Rahul England rescheduled test: ఇంగ్లాండ్‌తో జరగనున్న రీషెడ్యూల్ టెస్టుకు టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. అతడు కోలుకోవడానికి ఇంకా సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది.
"రాహుల్ ఇంకా కోలుకోలేదని తెలిసింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టుకు అతడు ఆడటం అనుమానమే. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది." ఓ క్రికెట్ ప్రతినిధి తెలిపారు. కాగా, గతేడాది ఇంగ్లాండ్- టీమ్ఇండియా మధ్య జరగాల్సిన చివరి టెస్టు కరోనా కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయింది. దాన్ని రీషెడ్యూల్ చేసి జులై 1న నిర్వహిస్తున్నారు. దీనికి రాహుల్ అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. ఇక ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌లు టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో భారత జట్టు ఓడిపోగా.. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మూడో టీ20లో 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (57; 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (54; 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించారు. బౌలింగ్‌లో హర్షల్ పటేల్, చాహల్ మెరిశారు.
ఇదీ చూడండి: మళ్లీ మెరిసిన నీరజ్ చోప్రా.. ఈసారి జాతీయ రికార్డు కైవసం